తమిళనాడులో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి… వీసీకే చేతిలో విజయ్ భవిష్యత్

తమిళనాడు రాజకీయాల్లో అనిశ్చితి కొనసాగుతోంది. అక్కడి రాజకీయం పూటకో మలుపు తిరుగుతోంది. సినీ సూపర్ స్టార్ విజయ్( Vijay) పేరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల్లో సంచలన విజయాన్ని సాధించినప్పటికీ, ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజారిటీ మాత్రం ఇంకా ఆయనకు దూరంగానే ఉంది.

తమిళ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన నటుడు విజయ్‌కు ఇప్పుడు అసలైన పరీక్ష మొదలైంది. డ్రావిడ రాజకీయ దిగ్గజాలకు చెక్ పెట్టి అతిపెద్ద పార్టీగా అవతరించిన తమిళగా వెట్రి కళగం — TVK… ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్‌కు మాత్రం ఇంకా రెండు అడుగుల దూరంలోనే నిలిచిపోయింది. గవర్నర్‌ను మూడు సార్లు కలిసినా… ఇంకా ఆహ్వానం రాకపోవడంతో రాజకీయ ఉత్కంఠ మరింత పెరిగింది. ఇక ఇప్పుడు అందరి చూపు VCK పార్టీ నిర్ణయంపైనే నిలిచింది.

234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. తాజాగా జరిగిన ఎన్నికల్లో తమిళగ( Tamilaga Vettri Kazhagam) పార్టీ 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా నిలిచింది. అయితే విజయ్ రెండు చోట్ల గెలవడంతో ప్రస్తుతం పార్టీకి 107 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు.

ఇక కాంగ్రెస్ పార్టీ మద్దతుతో మరో 5 మంది ఎమ్మెల్యేలు TVK వైపు వచ్చారు. అలాగే సీపీఐ, సీపీఎం పార్టీలు కలిపి మరో 4 మంది ఎమ్మెల్యేల మద్దతు ప్రకటించాయి. దీంతో విజయ్ కూటమి బలం ప్రస్తుతం 116కు చేరింది.

అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఇంకా ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఇదే ఇప్పుడు రాజకీయాల్లో కీలక మలుపుగా మారింది.

నిన్న సాయంత్రం వరకు విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమనే ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో టిటివి దినకరన్ నేతృత్వంలోని AMMK పార్టీ, అలాగే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ — IUML — మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేశాయి.

ఇప్పుడు అందరి దృష్టి Thol Thirumavalavan నేతృత్వంలోని VCK పార్టీపై పడింది. ఆ పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరి మద్దతు లభిస్తే విజయ్‌కు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ పూర్తవుతుంది.

సమాచారం ప్రకారం, విజయ్ నిన్న VCK నేతలతో పాటు AMMK, IUML ప్రతినిధులతో కూడా వరుస చర్చలు జరిపారు. అయితే ఇప్పటివరకు స్పష్టమైన హామీ రాలేదని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా విజయ్ తమిళనాడు గవర్నర్ ఆర్లేకర్ (RV Arlekar) ను బుధ, గురువారాల్లో పలుమార్లు కలిశారు. అయినప్పటికీ 118 మంది ఎమ్మెల్యేల మద్దతుకు సంబంధించిన లేఖలు సమర్పించలేకపోవడంతో గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానం ఇవ్వలేదని సమాచారం.

ఇక కాంగ్రెస్ పార్టీ మద్దతు కూడా షరతులతో కూడుకున్నదిగా తెలుస్తోంది. ప్రభుత్వంలో రెండు మంత్రిత్వ శాఖలు ఇవ్వాలని కాంగ్రెస్ కోరినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే వామపక్ష పార్టీలు మాత్రం ఎలాంటి షరతులు లేకుండా బయట నుంచే మద్దతు ప్రకటించాయి.

అంతిమంగా… తమిళ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన విజయ్ ఇప్పుడు మెజారిటీ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. VCK నిర్ణయం ఏంటన్నదే ఇప్పుడు తమిళనాడు రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనుంది.

Latest Articles

ఫరియా అబ్దుల్లా డైరెక్టర్ అవుతారా?

ఫరియా అబ్దుల్లా.. ‘జాతిరత్నాలు’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. తన కామెడీ టైమింగ్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు నటిగా మరో అడుగు ముందుకు వేస్తూ తమిళ సినిమాల్లోకి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్