కొనసాగుతున్న కరీంనగర్ బంద్.. గంగుల కమలాకర్ అరెస్ట్

కరీంనగర్ కేంద్రంలో రాజకీయ ఉద్రిక్తత కొనసాగుతోంది. మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ను అరెస్టు చేశారు పోలీసులు. అంతకు ముందు ఆయనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించడంతో నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గంగుల కమలాకర్ సహా బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.

గంగుల క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన ఆయన… ప్రజాస్వామ్యంలో భేదాభిప్రాయాలు సహజమే కానీ దాడులు, హింసాత్మక ఘటనలు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకారయోగ్యం కావని స్పష్టం చేశారు. కరీంనగర్ చరిత్రలో ఇది దురదృష్టకర ఘటనగా అభివర్ణించిన గంగుల… దాడికి పాల్పడిన వారెవ్వరైనా కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజల ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులను రక్షించే బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదేనని వ్యాఖ్యానించారు.

గురువారం జరిగిన ఈ ఘటనకు నిరసనగా శనివారం కరీంనగర్ బంద్‌కు బీఆర్‌ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. నగర ప్రజలు, వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్‌కు మద్దతు ఇవ్వాలని గంగుల కమలాకర్ విజ్ఞప్తి చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు శాంతియుతంగా బంద్‌లో పాల్గొని ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు.

ఇదిలా ఉండగా కరీంనగర్ నగరంలో బంద్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. వ్యాపారస్తులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేయగా… ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Latest Articles

ధనుష్‌.. ప్లాన్ అదిరింది..

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్, తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ధనుష్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్