35.2 C
Hyderabad
Friday, May 8, 2026
spot_img

స్వయంభు సైలెంట్ అవ్వడానికి కారణం ఏంటి..?

నిఖిల్.. కార్తికేయ 2 సినిమాతో ఊహించని విధంగా పాన్ ఇండియా రేంజ్లో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఆతర్వాత అదే స్పీడు కంటిన్యూ చేస్తాడు.. ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తాడు.. అని ఇండస్ట్రీ జనాలు అనుకున్నారు. అయితే.. అనుకున్నది అనుకున్నట్టుగా జరగలేదు.. మూడేళ్లు అవుతున్నా.. స్వయంభు ఇంకా రిలీజ్ కాలేదు. సమ్మర్ సీజను.. అలాగే కావాల్సినన్ని థియేటర్లు ఉన్నాయి. అయినా.. స్వయంభు మాత్రం రావడం లేదు.. అప్ డేట్ ఇవ్వడం లేదు. అసలు.. స్వయంభు ఎందుకు సైలెంట్ అయ్యింది..?

స్వయంభు సినిమా 2023లో స్టార్ట్ అయ్యింది. ఈ భారీ పాన్ ఇండియా మూవీ నుంచి టీజర్ వచ్చింది. లిరికల్ సాంగ్ వచ్చింది. ఈ రెండు వైరల్ అయ్యేంత కాకపోయినా జనాలకు బాగానే రీచ్ అయ్యాయి. ఈ రకంగా ప్రమోషన్స్ స్టార్ట్ చేసినా.. ఇంత వరుకు ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తుందో అప్ డేట్ లేదు.. అసలు క్లారిటీనే లేదు. ఇప్పటికే కొన్ని రిలీజ్ డేట్స్ అనుకున్నప్పటికీ.. సెట్ కాకపోవడంతో పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు. అయితే.. ఇంత వరుకు స్వయంభు రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించ లేదు. దీనిని బట్టి రిలీజ్ డేట్ లాక్ కాలేదని తెలుస్తోంది.

ఫిబ్రవరి నుంచి ఈ సినిమా వచ్చేస్తుంది అంటూ హడావిడి చేసిన ఈ మూవీ మేకర్స్ ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు అంటే.. ఇంకా ఫైనల్ కాపీ రెడీ కాలేదట. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని కంప్లీట్ చేసి పస్ట్ కాపీ రెడీ చేసే పనిలోనే బిజీగా ఉన్నారని టాక్. లేట్ అయినా ఫరవాలేదు.. లేటెస్ట్ గా రావాలి.. బొమ్మ అదిరిపోవాలి అనే ఉద్దేశ్యంతోనే క్వాలిటీ విషయంలో మరింత కేర్ తీసుకుంటున్నారట. మరో విషయం ఏంటంటే.. టీజర్ రిలీజ్ చేసినప్పుడు క్వాలిటీ విషయంలో కామెంట్స్ వచ్చాయి. వీరమల్లు, విశ్వంభర సినిమాల గ్లింప్స్ రిలీజ్ చేసిన తర్వాత ఎలాంటి కామెంట్స్ వచ్చాయో చూసాం. అందుకనే.. స్వయంభు టీమ్ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటున్నారట.

ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ఇంత వరుకు స్వయంభు మూవీకి ఓటీటీ డీల్ లాక్ కాలేదట. ఈ సినిమా నిర్మాత చెబుతున్న రేటుకు.. ఓటీటీ యాజమాన్యం చెబుతున్న రేటుకు మధ్య చాలా పెద్ద తేడానే ఉందట. అందుకనే డీల్ సెట్ కాలేదని సమాచారం. ఈ సినిమా కోసం మూడు సంవత్సరాల నుంచి నిఖిల్ కష్టపడుతూనే ఉన్నాడు. దర్శకుడు భరత్ కృష్ణమాచారి ఆడియన్స్ కి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలని చాలా కసరత్తు చేశాడు. అయితే.. క్వాలిటీ విషయంలో కేర్ తీసుకోవడం బాగానే ఉంది కానీ.. మరీ ఆలస్యం అయితే.. జనాలకు ఇంట్రెస్ట్ పోయే ఛాన్స్ ఉంది. మరి.. త్వరలోనే రిలీజ్ డేట్ లాక్ చేసి అనౌన్స్ చేస్తారేమో చూడాలి.

Latest Articles

తెలుగు సినిమాల పైనే ఫోకస్ పెట్టిన కార్తి..

కోలీవుడ్ స్టార్ కార్తి.. తమిళ ప్రేక్షకులనే కాదు.. తెలుగు ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకుని.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. ఊపిరి సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జునతో కలిసి నటించి.. తెలుగు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్