బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదు.. మోదీ రాక నేపథ్యంలో బీజేపీ వర్గాల్లో కలకలం

మేడ్చల్ జిల్లాలో సంచలన ఆరోపణల కేసు వెలుగులోకి వచ్చింది. కేంద్ర మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ (Bandi Sanjay Kumar) కుమారుడు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదు కావడం రాజకీయంగా కలకలం రేపుతోంది. 17 ఏళ్ల మైనర్ బాలిక ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.

మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కేసు నమోదు అయినట్లు సమాచారం. బాధిత మైనర్ బాలిక తన తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఫిర్యాదులో ఆమె పేర్కొన్న వివరాల ప్రకారం… గత డిసెంబర్ 31న మొయినాబాద్ ప్రాంతంలోని ఒక ఫామ్‌హౌస్‌లో జరిగిన పార్టీలో తనకు మద్యం తాగించి అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించింది. తన ప్రైవేట్ భాగాలను తాకినట్లు కూడా ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధిత బాలిక నివాసం సుచిత్ర ప్రాంతంగా గుర్తించినట్లు పేట్ బషీరాబాద్ సీఐ తెలిపారు.

భగీరథ్‌పై గతంలో దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో డ్రగ్స్, ర్యాగింగ్ కేసులు నమోదైంది.

ఈ ఘటన వెలుగులోకి రావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. రేపు హైదరాబాద్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( Narendra Modi) బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో బీజేపీ వర్గాల్లో మరింత కలకలం రేపుతోంది.

ప్రస్తుతం పోలీసులు కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఆధారాలు సేకరించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

Latest Articles

నిజామాబాద్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ మల్లారెడ్డి అరెస్ట్

నిజామాబాద్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ మల్లారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. ఈ సోదాల్లో రూ.3 కోట్లకుపైగా ఆస్తులు గుర్తించింది ఏసీబీ. 4...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్