35.2 C
Hyderabad
Friday, May 8, 2026
spot_img

ఓజీ డైరెక్టర్.. ప్లాన్ మారిందా..?

ఓజీ మూవీతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ సాధించిన టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్. ఈ మూవీ తర్వాత నేషనల్ స్టార్ నానితో సినిమా చేయాలి అనుకున్నాడు. అనుకోవడమే కాదండోయ్.. నాని, సుజిత్ కలిసి చేసే సినిమాని అఫీషియల్ గా కూడా అనౌన్స్ చేశారు. అనౌన్స్ మెంట్ వీడియోతో అంచనాలు పెంచేశారు. అయితే.. ఇంత వరుకు ఈ క్రేజీ మూవీ పట్టాలెక్కలేదు. ఇప్పుడు సుజిత్ ప్లాన్ మారిందని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. నానితో సుజిత్ మూవీ ఏమైంది..? సుజిత్ నయా ప్లాన్ ఏంటి..?

ఓజీ డైరెక్టర్ సుజిత్.. నేచురల్ స్టార్ నానితో సినిమా చేయాలి అనుకున్నారు. ఇంకా చెప్పాలంటే.. ఈ సినిమాని ఓజీ రిలీజ్ కంటే ముందే చేసేలా ప్లాన్ చేశారు. అంతా రెడీ చేసుకున్నా.. పవన్ డేట్స్ ఇవ్వడంతో.. నాని సినిమాని పక్కన పెట్టి ఓజీ కంప్లీట్ చేసారు. ఇక ఓజీ కంప్లీట్ అయ్యింది.. రిలీజై బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇప్పుడు నానితో సినిమాని సెట్స్ పైకి తీసుకురావాలి అనుకుంటే.. ప్యారడైజ్ షూటింగ్లో బిజీగా ఉన్నాడు నాని. ఈ సినిమాని సమ్మర్లో రిలీజ్ చేయాలి. అలా జరిగితే.. సుజిత్ తో సినిమాని వెంటనే పట్టాలెక్కించాలనేది నాని ప్లాన్. అయితే.. ప్యారడైజ్ మూవీ షూటింగ్ కంప్లీట్ కాలేదు. మార్చి 26న రావాలి అనుకున్న ఈ సినిమా ఆగష్టు 21కి వాయిదాపడింది.

అప్పటి వరుకు నాని ప్యారడైజ్ షూటింగ్లోనే ఉంటారు. నానితో సుజిత్ చేసే సినిమా బ్లడీ రొమియో అంటూ టైటిల్ అనౌన్స్ చేసి స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. టైటిల్ ఇంట్రెస్టింగ్ ఉండడం.. అనౌన్స్ మెంట్ వీడియో కూడా డిఫరెంట్ గా ఉండడంతో ఈ సినిమా పై మరింత బజ్ క్రియేట్ అయ్యింది. లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. ఈ ఇయర్ ఎండింగ్లో లేదా 2027 బిగినింగ్లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తారని సమాచారం. అయితే.. ఈ గ్యాప్ లో సుజిత్.. ఓజీ 2 స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారట. ఓజీ మూవీ పవర్ స్టార్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో.. ఓజీ 2 పై మరింత క్రేజ్ ఏర్పడింది. అంచనాలకు మించి ఉండేలా ఈ స్టోరీ రెడీ చేస్తున్నారట. మొత్తానికి సుజిత్.. తన నుంచి రానున్న రెండు సినిమాల కథల పై కసరత్తు చేస్తున్నారు. మరి… ఈ సినిమాలతో సుజిత్ బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో సౌండ్ చేస్తాడో చూడాలి

Latest Articles

తెలుగు సినిమాల పైనే ఫోకస్ పెట్టిన కార్తి..

కోలీవుడ్ స్టార్ కార్తి.. తమిళ ప్రేక్షకులనే కాదు.. తెలుగు ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకుని.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. ఊపిరి సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జునతో కలిసి నటించి.. తెలుగు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్