కోలీవుడ్ స్టార్ కార్తి.. తమిళ ప్రేక్షకులనే కాదు.. తెలుగు ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకుని.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. ఊపిరి సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జునతో కలిసి నటించి.. తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గరయ్యాడు. ఆతర్వాత తెలుగులో స్ట్రైయిట్ మూవీ చేయలేదు. ఇప్పుడు కార్తి టాలీవుడ్ పై ఫోకస్ పెట్టి.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు సినిమాలు చేయబోతుండడం విశేషం. ఇంతకీ.. కార్తి చేస్తున్న ఆ మూడు సినిమాలు ఏంటి..? అవి సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడు..?
తమిళ హీరో కార్తి.. యుగానికి ఒక్కడు, ఆవారా సినిమాలతో కెరీర్ ఆరంభంలోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆతర్వాత నా పేరు శివ, ఖాకీ, జపాన్, కాష్మోరా తదితర చిత్రాలతో అలరించి తెలుగులో తనకంటూ ఓ మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక టాలీవుడ్ కింగ్ నాగార్జునతో కలిసి ఊపిరి సినిమాలో శీను పాత్రలో అద్భుతంగా నటించి గుడ్ పర్ ఫార్మర్ అనే పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమాతో కార్తి తమిళ హీరో కాదు.. తెలుగు హీరో అనేంతగా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యాడు. ఇలా తెలుగు జనాలకు బాగా కనెక్ట్ అయిన కార్తి ఇప్పుడు తమిళ సినిమాల కంటే.. ఎక్కువుగా తెలుగు సినిమాల పైనే ఫోకస్ పెట్టడం.. తెలుగులో ఏకంగా మూడు సినిమాల్లో నటిస్తుండడం విశేషం.
ఇంతకీ కార్తి నటిస్తున్న మూడు సినిమాలు ఏంటంటే.. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో కార్తి ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి కళ్యాణ్ శంకర్ డైరెక్టర్. ఇందులో కార్తికి జంటగా మీనాక్షి చౌదరి నటిస్తుంది. ఈ మూవీ రీసెంట్ గా స్టార్ట్ అయ్యింది. ఇక కార్తి నటించే రెండో సినిమా ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ఉంటుందని తెలిసింది. ఆల్రెడీ బోయపాటి.. కార్తికి కథ చెప్పడం.. ఆ కథకు కార్తి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందని టాక్ వినిపిస్తోంది. మరి.. మూడో సినిమా ఏంటంటే.. హిట్ 4 . నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో.. శైలేష్ కొలను డైరెక్ట్ చేసే ఈ సిరీస్ సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఇవే కాకుండా.. తెలుగులో మరి కొందరు దర్శకులు కార్తితో సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని టాక్. మొత్తానికి కార్తి.. కోలీవుడ్ కంటే.. టాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టడం ఆసక్తిగా మారింది. మరి.. ఈ సినిమాలతో ఎంత వరుకు మెప్పిస్తాడో.. ఎలాంటి విజయం సాధిస్తాడో చూడాలి


