వరుడికి షాక్.. కట్నం సరిపోలేదని పెళ్లి ఆపేసిన వధువు

Medchal |కట్నం సరిపోలేదని వరుడు పెళ్లి ఆపేసిన ఘటనలు చాలా చూశాం. కానీ ఓ పెళ్లి మాత్రం ఊహించని ఘటనతో ఆగిపోయింది. కాసేపట్లో పెళ్లి జరగనుండగా.. తనకు ఎదురుకట్నం సరిపోలేదని వధువు పెళ్లికి నో చెప్పేసింది. ఈ వింత ఘటన మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఓ కాలనీకి చెందిన యువకుడికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన యువతితో వివాహం కుదిరింది. అమ్మాయికి ఎదురుకట్నం కింద రెండు లక్షల రూపాయలు ఇచ్చేందుకు పెద్దల సమక్షంలో ఇరు కుటుంబాల మధ్య అంగీకారం జరిగింది.

ఈ నెల 9న రాత్రి 7 గంటల 21 నిమిషాలకు వివాహం ముహూర్తం నిశ్చయించారు. ముహూర్తానికి ముందే అబ్బాయి కుటుంబసభ్యులు, బంధుమిత్రులు ఆ ఫంక్షన్ హాల్​కు చేరుకున్నారు. ముహూర్తానికి సమయం అవుతున్నా.. అమ్మాయి రాకపోవడంతో వరుడి కుటుంబసభ్యులు ఆరాతీశారు. అబ్బాయి తరఫున ఇచ్చే కట్నం సరిపోవడం లేదని, అదనంగా కావాలని వధువు డిమాండ్‌ చేసింది. వరుడి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో అమ్మాయి కుటుంబసభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా కానీ వారు ససేమిరా అనడంతో పెళ్లి ఆగిపోయింది. తొలుత ఇచ్చిన రూ.2 లక్షలు సైతం అబ్బాయి కుటుంబసభ్యులు వదులుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటన వైరల్ అవుతోంది.

Read Also: ఇలాంటి సీఎంని నేనెక్కడ చూడలేదు: కన్నా లక్ష్మీ నారాయణ

Follow us on:   Youtube   Instagram

Latest Articles

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోరు ఖాయమేనా?

తెలంగాణ రాజకీయ ముఖచిత్రం అనూహ్య మలుపులు తిరుగుతోంది. రాష్ట్రంలో రాబోయే 2028 ఎన్నికల్లో ముఖాముఖి పోరు ఖాయమని, బీఆర్ఎస్, బీజేపీలు కలిసి పోటీ చేస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్