స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ దంపతులకు నంద్యాల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసులో నంద్యాల కోర్టు న్యాయమూర్తి ఆదేశాల మేరకు దంపతులిద్దర్ని కర్నూలు జైలుకు తరలించారు పోలీసులు. టీడీపీ యువ నాయకుడు నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్రలో కొత్తపల్లి వద్ద ఏవీ సుబ్బారెడ్డిపై దాడి ఘటనలో ఈరోజు ఉదయం అఖిల ప్రియను పోలీసులు అరెస్టు చేసి.. అనంతరం పాణ్యం పోలీసు స్టేషన్‌కు తరలించారు. భూమా అఖిలప్రియపై సెక్షన్ 307 కింద పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం దంపతులకు రిమాండ్ విధించింది.
బ్రేకింగ్: భూమా అఖిలప్రియ దంపతులకు రిమాండ్
0
363
Previous article
Latest Articles
ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు
ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్‌లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -
- Advertisement -


