పవన్‌ కల్యాణ్‌కు హరిరామజోగయ్య మరో లేఖ

           జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు హరిరామ జోగయ్య మరో లేఖ రాశారు. తన సలహాలు పవన్‌కు నచ్చినట్లు లేవన్నారు. పవన్ లేకుండా టీడీపీ గెలవడం అసాధ్యమన్నారు. ఆ విషయం చంద్రబాబుకు కూడా తెలుసన్నారు. ఎన్నికల తర్వాత జనసేనను నిర్వీర్యం చేసి.. లోకేష్‌ను సీఎం చేస్తారన్న భయం జనసేన కార్యకర్తల్లో ఉందన్నారు. ఎన్నికలకు ముందే పవన్ స్థానం ఎంటో చెప్పాలని.. కార్యకర్తల తరఫున డిమాండ్ చేస్తే తప్పేంటి అన్నారు. తనను వైసీపీ కోవర్టుగా చిత్రీకరిస్తున్నారని ఫైర్ అయ్యారు. మిత్రులెవరో.. శత్రువులు ఎవరో పవన్ తెలుసుకోవాలని సూచిం చారు. ప్యాకేజీ వీరుడంటూ పవన్‌పై విమర్శలు చేస్తుంటే.. చంద్రబాబు మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. పవన్‌కు ఇష్టమున్నా లేకపోయినా అయన వెంటే ఉంటా అన్నారు. పవన్ కల్యాణ్‌ను కాపాడుకోవడం తన బాధ్యతగా భావిస్తా నని తెలిపారు. చచ్చే వరకు తన ప్రవర్తన ఇలాగే ఉంటుందని తేల్చి చెప్పారు. పవన్ లక్ష్యానికి తన మద్దతు ఎప్పటికి ఉంటుందన్నారు.

 

Latest Articles

బాలయ్య సినిమాల.. ప్లానింగ్ మారుతుందా..?

నందమూరి బాలకృష్ణకి.. షూటింగ్లో గాయాలు అవ్వడం తెలిసిందే. ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతానికి ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది. దీంతో బాలయ్య సినిమాల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్