స్వతంత్ర, వెబ్ డెస్క్: భారతదేశం మూడు దశాబ్దాల తరువాత ప్రపంచ సుందరి ఎంపిక పోటీలకు ఆతిధ్యం ఇవ్వనుంది. 1996 తరువాత భారత్ లో ఈ ఏడాది 71వ ప్రపంచ సుందరి – 2023 ఫైనల్ పోటీలు జరగనున్నాయి. ఈ విషయాన్ని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఛైర్‌పర్సన్, సీఈవో జులియా మోర్లే మీడియా సమావేశంలో ప్రకటించారు. 130 దేశాల జాతీయ ఛాంపియన్లు అద్భుతమైన భారతదేశంలో నవంబర్‌లో నెల రోజులు పాటు విడిది చేస్తారు. పలు ప్రతిభా ప్రదర్శనలు, క్రీడల సవాళ్లు, సేవా కార్యక్రమాలతో ఈ పోటీలు కొనసాగుతాయి. మార్పునకు రాయబారులుగా నిలిచే పోటీదారుల ప్రత్యేకతలను ప్రదర్శించడమే వీటి ఉద్దేశం’’ అని వివరించారు. ఈ పోటీల ప్రచారం కోసం భారత్‌కు వచ్చిన గతేడాది ప్రపంచ సుందరి విజేత కరోలినా బియెలావ్‌స్కా (పోలండ్) మాట్లాడుతూ.. ‘‘గొప్ప ఆతిథ్యానికి, విలువలకు ప్రతిరూపమైన ఈ అందమైన దేశంలో నా కిరీటాన్ని తదుపరి విజేతకు అందించేందుకు ఉత్సుకతతో ఎదురుచూస్తున్నా’’ అన్నారు.
మూడు దశాబ్దాల తరువాత భారత్ వేదికగా ప్రపంచ సుందరి ఎంపిక పోటీలు
0
419
Previous article
Latest Articles
టీఎంసీ రాజ్యసభ ఎంపీ సుఖేందురే రాజీనామా
మాజీ సీఎం మమతా బెనర్జీకి మరో షాక్ తగిలింది. టీఎంసీ రాజ్యసభ ఎంపీ సుఖేందురే రాజీనామా తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఉపరాష్ట్రపతికి అందజేశారు. పార్టీకి కూడా రాజీనామా చేసినట్టు...
- Advertisement -
- Advertisement -


