అమెరికాలో దారుణమైన స్థితికి పడిపోయిన వాయుకాలుష్యం

స్వతంత్ర, వెబ్ డెస్క్: అమెరికాలోని న్యూయార్క్‌, న్యూజెర్సీ, బోస్టన్‌, ఫిలడెల్ఫియా, వాషింగ్టన్‌ డీసీ, రాలీ, కొలంబియా సిన్సినాటి, క్లీవ్‌లాండ్‌, డెలావేర్‌, పెన్సిల్వేనియా, సౌత్‌ కరోలినాలాంటి చోట్ల రెండు రోజులుగా దట్టమైన పొగలు ఆవరించాయి. చాలాచోట్ల ఆకాశానికి ఊదారంగు దుమ్ముదుప్పటి కప్పుకొన్నట్లుంది. స్కూళ్లలో బయటి కార్యకలాపాలు రద్దు చేశారు. న్యూయార్క్‌ పట్టణంలోనైతే.. వాయు నాణ్యత దారుణంగా పడిపోయింది. ప్రమాదకర స్థాయిలో 500 ఏక్యూఐ నమోదైంది. 1999లో వాయునాణ్యతను రికార్డు చేయటం మొదలెట్టిన తర్వాత న్యూయార్క్‌లో ఈ స్థాయిలో ఏక్యూఐ నమోదవటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. ఏక్యూఐ 300 దాటితే ప్రమాదకరంగా పరిగణిస్తారు. అందుకే.. అమెరికా వాతావరణ శాఖ అనేక రాష్ట్రాలకు ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు మాస్కులు ధరించాలని సలహా ఇచ్చింది. బైడెన్‌ సైతం ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించారు. ‘‘మనం ప్రస్తుతం ప్రమాదకర వాయుకాలుష్యాన్ని ఎదుర్కొంటున్నాం. ముఖ్యంగా అనారోగ్య సమస్యలున్నవారు అధికారులు చెప్పినట్లు విని… ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి’’ అని ఆయన సూచించారు.

Latest Articles

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్‌లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్