సినీనటి వరలక్ష్మీ నిశ్చితార్థం

    వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరో శరత్‌కుమార్‌ కూతురు వరలక్ష్మీ నికోలాయ్‌ సచ్‌దేవ్‌ అనే వ్యక్తి ఎంగేజ్‌మెంట్‌ చేసుకుని షాక్‌ ఇచ్చింది. కుటుంబసభ్యులు, అతి కొద్ది మంతి సన్నిహితుల మధ్య ఈ నిశ్చితార్థ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య గత 14 ఏళ్ళుగా ప్రేమాయణం నడిచినట్లు సినీ వర్గాల సమాచారం. నిశ్చితార్థకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

      నటుడు శరత్ కుమార్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు వరలక్ష్మీ. నటనలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2012లో అరంగేట్రం చేసిన ఈమె తమిళం, కన్నడం, మలయాళం, తెలుగు సినిమాల్లో నటించారు, నటిస్తున్నారు. ఆమె విలన్ గా నటించిన చిత్రాలు మంచి పేరు తెచ్చిపె ట్టాయి. నటిగా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. క్రాక్ సినిమాలో విలన్‍గా జయమ్మ పాత్రతో తెలుగులో నటించిన వరలక్ష్మీ బాగా ఫేమస్ అయ్యారు. ఇటీవల హనుమాన్ చిత్రంలో హీరో పాత్రకు అక్కగా నటించి మెప్పించారు. ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కేందుకు వరలక్ష్మీ సిద్దమయ్యారు. ఇటీవల ఆమె నిశ్చితార్థం ముంబైలో కుటుంబ , సన్నిహితుల మధ్య ఘనంగా జరిగింది.

       ముంబైలో గ్యాలరిస్ట్ నికోలై సచ్‍దేవ్‍తో వరలక్ష్మీ శరత్ కుమార్ కు నిశ్చితార్థం జరిగింది. ముంబైలో ఇరు కుటుంబా లు, సన్నిహితుల మధ్య ఈ వేడుక జరిగింది. నికోలై సచ్‍దేవ్.. ఆర్ట్ గ్యాలరీను నిర్వహిస్తుంటారని తెలుస్తోంది. వర లక్ష్మి, సచ్‍దేవ్ నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ‘ముంబైలో మార్చి 1న జరిగిన వేడుకలో కుటుంబాలు, సన్నిహితుల సమక్షంలో నటి వరలక్ష్మి శరత్ కుమార్, గ్యాలరిస్ట్ నికోలై సచ్‍దేవ్ ఎంగేజ్‍మెంట్ జరిగింది. గత 14 ఏళ్లుగా ఒకరితో ఒకరికి పరిచయం ఉన్న వరలక్ష్మి, శరత్ రింగులు మార్చుకున్నారు’ ఈ ఏడాదిలోనే ఇద్దరూ పెళ్లి చేసుకోనున్నారని తెలుస్తోంది.

Latest Articles

సుకుమార్.. మార్పు కోరుకుంటున్నారా..?

క్రియేటీవ్ జీనియస్ సుకుమార్.. పుష్ప 2 రిలీజై సంవత్సరంన్నర అయినా ఇంత వరుకు కొత్త సినిమాని పట్టాలెక్కించలేదు. త్వరలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో మూవీని స్టార్ట్ చేయడానికి సుకుమార్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్