టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు తెలుగుజాతి సెంటిమెంట్ అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతానని చెప్పారు. మహానాడులో ఎన్టీఆర్‌కు నివాళి అర్పించే తీర్మానంపై సీఎం ప్రసంగించారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని మహానాడులో ప్రతిపాదించారు. దేశ అత్యున్నత పౌర పురస్కారంతో ఎన్టీఆర్‌ను సత్కరించాలని సీఎం చంద్రబాబు కోరారు. ఎన్టీఆర్ అంటే పేదలకు భరోసా.. రైతుకు నేస్తమని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ అంటే అన్నివర్గాలు ప్రేమించే నాయకుడని ప్రశంసించారు. సాధారణ ఉద్యోగిగా మొదలై, సినిమా స్టార్‌గా ఎదిగి, ప్రజల కోసం పార్టీ పెట్టి సీఎంగా ఎదగడం ఎన్టీఆర్‌కే సాధ్యమని కీర్తించారు. పార్టీ పెట్టిన 9నెలల్లో సీఎం కావడం ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాలేదని చెప్పారు.
ఎన్టీఆర్ అంటే తెలుగుజాతి సెంటిమెంట్.. భారతరత్న ఇవ్వాలి- చంద్రబాబు
0
6
Latest Articles
ట్విషా శర్మ కేసులో అత్త గిరిబాల సింగ్ బెయిల్ రద్దు
ట్విషా శర్మ మరణ కేసులో మాజీ న్యాయమూర్తి గిరిబాల సింగ్‌కు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను మధ్యప్రదేశ్ హైకోర్టు రద్దు చేసింది. బుధవారం జబల్‌పూర్‌లో ఈ కేసును విచారిస్తున్న వెకేషన్ జడ్జి దేవనారాయణ్...
- Advertisement -
- Advertisement -


