తప్పు జరిగింది.. క్షమించండి- పవన్‌ కళ్యాణ్‌

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో తప్పు జరిగింది.. రాష్ట్ర ప్రభుత్వం తరపున క్షమాపణలు కోరుతున్నానని అన్నారు. వైకుంఠద్వార దర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో చికిత్స పొందుతున్న బాధితులను
ఆమన పరామర్శించారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

“టీటీడీలో ప్రక్షాళన జరగాలి. టీటీడీ ఈవో, అడిషనల్‌ ఈవో బాధ్యత తీసుకోవాలి. శ్యామలరావు, వెంకయ్య చౌదరి విఫలమయ్యారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరగాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. టీటీడీ వీఐపీలపై కాదు.. సామాన్యులపై దృష్టి పెట్టాలి. మృతుల కుటుంబాల వద్దకు వెళ్లి టీటీడీ క్షమాపణ చెప్పాలి”.. అని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు.

Latest Articles

కాంగ్రెస్‌లో మళ్లీ నామినేటెడ్ పదవుల టెన్షన్ మొదలయ్యిందా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల టెన్షన్ మళ్లీ మొదలైంది. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం దక్కించుకున్న నేతలకు ఇప్పుడు రెన్యువల్ గుబులు పట్టుకుంది. జూలై నెలాఖరుతో వీరి పదవీకాలం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్