ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన

ఆకాశానికి చిల్లు పడ్డట్టుగా భారీ వర్షం ఏకధాటిగా కురుస్తోంది. దీంతో మహబూబాబాద్‌ జిల్లా చిగురాకులా వణికిపోతోంది. ఎడతెరిపి లేని వర్షంతో సీతారాంతండాకు వరద నీరు పోటెత్తింది. వరదలో జీపు చిక్కుకుపోవడంతో.. అందులో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన 9 మందిని సహాయక బృందాలు రక్షించాయి. ఆ తర్వాత వరదలో ఖాళీ అయిన జీపు వరదలో కొట్టుకుపోయింది.

భారీ వర్షాల కారణంగా ములుగు జిల్లా తాడ్వాయి మండలం మొండలతోగు, జనగాలంచ వాగు ఉధృతికి కొట్టుకుపోయిన రోడ్డును, మేడారం జంపన్న వాగు ఉధృతిని మంత్రి సీతక్క పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని..స్వీయ రక్షణ పాటించాలని పిలుపునిచ్చారు. ముంపు ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని.. వాగులను దాటే ప్రయత్నం చేయొద్దని, ఆఫీసర్లకు సహకరించాలని సూచించారు.

Latest Articles

రాయదుర్గంలో అర్ధరాత్రి రేసింగ్.. కానిస్టుబుల్ కు గాయాలు

హైదరాబాద్ రాయదుర్గం పరిధిలో అర్ధరాత్రి యువకుల రేసింగ్ కలకలం రేపింది. కార్లకు భారీ సౌండ్ సైలెన్సర్లు పెట్టి రాత్రి వేళల్లో రాష్ డ్రైవింగ్ చేస్తోంది యువత. వీకెండ్స్ లో పోలీసుల కళ్ళు గప్పి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్