రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ ఫీవర్ మొదలైంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియకు JNTU ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాట్లు పూర్తి చేశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రం నుంచి 3 కిలోమీటర్ల వరకు రెడ్ జోన్‌గా ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా హై అలెర్ట్ ప్రకటించి 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు తావు లేకుండా భద్రత చర్యలు ఏర్పాటు చేసారు. ఉదయం 8 గంటలకే కౌంటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కౌంటింగ్ హాల్లో ఏజెంట్లకు కలెక్టర్ ఆధ్వర్యంలో దిశా నిర్దేశం చేశారు. దాదాపు 1300 పైగా సిబ్బంది కౌంటింగ్ విధుల్లో పాల్గొననున్నారు. అనంతపురం జిల్లా కౌంటింగ్ కేంద్రంలో 8 నియోజక వర్గాలు, 2 పార్లమెంట్ స్థానానికి కౌంటింగ్ జరగనుంది. ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్ళు ఏర్పాటు చేశారు. ఉరవకొండ ఒక్క నియోజకవర్గానికి 18 టేబుళ్లు ఏర్పాటు చేసారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జీవన్ అందిస్తారు.
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన ఎన్నికల కౌంటింగ్ ఫీవర్
0
169
Latest Articles
ఫరియా అబ్దుల్లా డైరెక్టర్ అవుతారా?
ఫరియా అబ్దుల్లా.. ‘జాతిరత్నాలు’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. తన కామెడీ టైమింగ్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు నటిగా మరో అడుగు ముందుకు వేస్తూ తమిళ సినిమాల్లోకి...
- Advertisement -
- Advertisement -


