తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని వీఐపీ విరామ సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రేణుకా చౌదరి దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనం బాగా జరిగిందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని ఆలయం వెలుపల రేణుకా చౌదరి మీడియాతో అన్నారు. రైతులకు పంటలు బాగా పండి, దేశం బాగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు చెప్పారు. దేశం కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సేవలు అందిస్తూనే ఉంటుందని రేణుకా చౌదరి తెలిపారు. శ్రీవారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో రేణుకా చౌదరికి వేద పండితులు వేద ఆశీర్వాదం అందించారు. టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి
0
379
Latest Articles
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నిర్ణయం వెనుక బీజేపీ బహుముఖ వ్యూహం
కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ ఆకస్మిక రాజీనామా దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. జాతీయ స్థాయిలో జరిగిన వివిధ ప్రవేశ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలపై విద్యార్థి లోకం...
- Advertisement -
- Advertisement -


