వరంగల్ ఎంజీఎం..పేరుకు పెద్ద ఆసుపత్రి. రాష్ట్రంలోనే అతి పెద్ద ఆసుపత్రిగా ఎంజీఎం ఖ్యాతి గడించినా, ఇక్క డున్న సౌకర్యాల లేమి ఎక్కడా లేదేమో అనిపిస్తోంది. భద్రపరిచే ఫ్రీజర్లు కరువు, గబ్బు కొడుతున్న పోస్టుమార్టం గదులు, రక్తం ఓడుతున్న గదులు, కుళ్లిపోయి పురుగులు పడుతున్న మృత దేహాలు, కనీస వసతులు లేక ఇబ్బంది పడుతున్న సిబ్బంది, మార్చురీకి రావాలంటేనే జంకుతున్న మృతుల కుటుంబాలు ఇదీ ఈ ఘనమైన ఆసుపత్రి పరిస్థితి. కనీస సౌకర్యాలకు నోచుకోక అల్లాడుతున్న ఎంజీఎంపై స్వతంత్ర టీవీ ప్రత్యేక కధనం.
కదలిరండి మనుషులైతే కలసిరండి మనసువుంటే ఓ చిత్ర గీతం ఇది. పెద్ద ఉప్పెన సంభవించిన సమయంలో తీసిన చిత్రం ఇది. ప్రకృతి ప్రళయానికి కుప్పలు తిప్పలుగా పడివున్న మృతదేహాల ఖనన, దహనాలు చేయడానికి రమ్మ ని పిలిచే హృదయ విదారక చిత్ర గీతం ఇది. అంతటి విపత్కరపరిస్థితిలో ఎందరెందరో స్వచ్ఛందంగా వచ్చి సేవలు అందించిన సందర్భం ఆ ఘట్టంలో కనిపిస్తుంది. మరి లోపం ఎక్కడుందో కాని, అన్నివిధాలా జీతాలు, భత్యాలు పొందుతూ, వరంగల్ ఎంజీఎం అధికారులు నిర్లిప్త వైఖరి అవలంభిస్తున్నారు. ఇక్కడి మార్చురీలో ఎందరో అనాథల మృతదేహాలు కుళ్లి పురుగులు పడుతు న్నాయి. జీవితకాలంలో అనాథ బతుకు బతికిన నిర్భాగ్యులు కాలం చేశాక సైతం దహన క్రియలకు నోచుకోవడం లేదు. మృత దేహాలు భద్రపర్చే ఏ రసాయన చర్యలు చేపట్టకుండా, రోజుల తరబడి మార్చురీలో మృతదేహాలను ఉంచేయడంతో, ఆ శవాలు కుళ్లిపోతున్నాయి.వరంగల్ ఎంజీఎం లో పోస్టు మార్టం గదుల్లో, మృతదేహాలను భద్రపరిచే ప్రాంతంలో దుర్గంతపూరిత వాతావరణం నెలకొంది. పేరుకే పెద్దాస్పత్రి అయినా ఇక్కడ పోస్టుమార్టం చేయడానికి కనీస వసతులు లేవు. వేసవి ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇక్కడి పొస్ట్ మార్టం గదుల్లో ఏసీలు, మృతదేహాలను భద్ర పరిచే ఫ్రీజర్లు పనిచేయడం లేదు. అనాథ మృత దేహాలు వస్తే వాటిని భద్రపర్చే కనీస సదుపాయం సైతం లేదు. ఏసీలు పనిచేయడం లేదు. గత రెండు నెలలుగా ఈ దుస్థితి నెలొకొన్నట్టు ఆసుపత్రి సిబ్బంది చెబుతున్నారు.
తెలంగాణలో అతి పెద్ద ఆసుపత్రిగా పేరుపొందడంతో ఎంజిఎంకు ప్రతి నిత్యం వేలాది ప్రజలు వస్తూంటారు. ఎన్నో అత్యవసర కేసులు ఇక్కడకు వస్తూంటాయి. ఇదేకాక ప్రమాదాల్లో మరణించినవారి మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఇక్కడకు తీసుకొస్తూంటారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాల ను భద్రపరిచేందుకు కావాల్సిన ఫ్రీజర్లు మార్చురీ యూనిట్ పనిచేయడం లేదు. ఈ పరిస్థితిలో రోజుల తరబడి ఉంచిన మృతదేహాలు కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లు తోంది. కనీసం దుర్వాసన అరికట్టే రసాయనాలు సైతం అందుబాటులో లేకపోవడం ఎంతో శోచనీయం. పనిచేయని ఫ్రీజర్లు, ఏసీలకు మరమ్మతులు చేయించడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. అధికారుల నిర్లక్ష్య, నిర్లిప్త వైఖరిపై రోగులు, రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భయంకర దుర్వాసనను భరిస్తూ పోస్ట్ మార్టం సిబ్బంది తమ విధులు నిర్వహిస్తున్నారు. అయితే, రోగాల బారిన పడుతున్నారు. మృతుల కుటుంబీకులు సైతం అక్కడ క్షణం సేపు ఉండలేకపోతున్నారు. మరోవైపు కొందరు సిబ్బంది. పెద్దాసు పత్రి మార్చురీకి వచ్చే మృతదేహాల పోస్టుమార్టంకు నిరాకరిస్తున్నారు. ఈ సిబ్బంది నిరాకరించేది, అక్కడి దుర్గందపూరిత వాతావరణ పరిస్థితుల గురించే కాకుండా, సొమ్ముల గురించి ఈ రీతిన ప్రవర్తిస్తున్నారు. మృతుల కుటుంబీకులు, పెద్ద మొత్తం ఇస్తేనే పోస్టుమార్టం ఇస్తామని షరతులు పెడుతున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఆర్ధిక స్థోమత, పలుకుబడి ఆధారంగా రేట్లు నిర్ణయించి కాసులు దండు కుంటున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సొమ్ములు ఇవ్వకపోతే మృతుల కుటుంబీకులకు పోస్ట్ మార్టం సిబ్బంది చుక్కలు చూపిస్తున్నారు. పోస్టు మార్టానికి తీవ్ర జాప్యం చేస్తున్నారు. అడిగిన సొమ్ములు ఇవ్వకపోతే పోస్టుమార్టాన్ని నిర్లక్ష్యంగా చేస్తున్నా రని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోస్ట్ మార్టం చెసే సిబ్బంది అసలు ఆసుపత్రికి సంబంధిం చిన వారా..? కాదా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సర్కారు మార్పుతో కాంట్రాక్ట్ సంస్థలు ఎంజీఎంవైపు కన్నెత్తి చూడడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. వరంగల్ ఎంజీఎం, కేఎంసీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, కరీంనగర్ జనరల్ ఆసుపత్రి లోని ఏసీలు, ఎక్స్ రే మెషిన్లు, మార్చురీల్లో ఫ్రీజర్ల నిర్వహణకు గత ప్రభుత్వం కొన్ని కాంట్రాక్ట్ సంస్థలకు అప్పగించింది. అయితే, అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు తమ అనుయాయులు, అభిమానులకు ఈ కాంట్రాక్ట్ లు అప్పగించారనే ఆరోపణలు ఉన్నాయి. ఏసీలు, మెషన్లు ఏర్పాటు చేసిన నాటి నుంచి రెండు, మూడేళ్లపాటు ఈ నిర్వహణా బాధ్యత లను కాంట్రాక్ట్ సంస్థలు చూసుకోవాల్సి ఉంది. అయితే, ప్రభుత్వం మారడంతో కాంట్రాక్ట్ సంస్థలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తు న్నాయి. వరంగల్ ఎంజీఎం మార్చురీలో కొన్ని నెలల క్రితం 85 లక్షల రూపా యల నిధులతో అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. ఆసుపత్రిలో ఫ్రీజర్ ఏర్పాటును ఎస్ కే సర్జికల్స్ అనే సంస్థకు అప్పగించారు. ఫ్రీజర్లకు ఏ రిపేర్ వచ్చినా ఈ సంస్థే చేయాల్సి ఉంది. అయితే, ఫ్రీజర్ల మరమ్మతు చేయాలని కాంట్రాక్ట్ సంస్థను తాము పలుసార్లు కోరినా.. ఆ సంస్థ స్పందించడం లేదని ఎంజీఎం ఆర్ఎంవో అంబి శ్రీనివాస్ తెలిపారు.
కేఎంసీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఏసీలు పనిచేయకపోవడంతో ఆపరేషన్లు నిర్వహించలేని పరి స్థితి నెలకొందని, తప్పని పరిస్థితుల్లో ఎంజీఎంలోనే ఆపరేషన్లు చేస్తున్నట్టు నోడల్ ఆఫీసర్ అనిల్ బాలరాజు తెలిపారు.ఎంజీఎంలో డిజిటల్ ఎక్స్ రే మెషీన్లకు రిపేర్లు చేసేలా సంబంధిత సంస్థలతో మాట్లాడుతామని అధికారులు చెబుతున్నారు. కరీంనగర్ హాస్పిటల్లోనూ ఏసీలు పనిచేయడం లేదన్న విషయం వాస్తవమేనని, ఈ విషయంపై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చామని సూపరింటెండెంట్ వీరారెడ్డి తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కాంట్రాక్ట్ సంస్థలతో రిపేర్లు చేయించాలని, మార్చు రీల్లో మృతదేహాలను రోజుల తరబడి ఉంచడం వల్ల.. అనారోగ్య పరిస్థితులు తల్లెత్తి ఏ అవాంఛనీ య ఘటనలైనా జరిగితే అప్పుడు చింతించి ప్రయోజనం ఉండదని ప్రజలు అంటున్నారు. రిపేర్ల పై నిర్లక్ష్యం అవలంభిస్తున్న కాంట్రాక్ట్ సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎంజీఎం మార్చు రీపై చిన్నచూపు చూడడం అధికారులకు తగదని, వెంటనే దీనిపై దృష్టి సారించి మరమ్మత్తులు చేపట్టా లని మృతుల కుటుంబీకులు, స్థానికులు వేడుకొంటున్నారు. మృతదేహాలను భద్రపరిచే ఫ్రీజర్లు, ఏసీల ను బాగు చేయించి, మార్చురీ గదిలో పరిశుభ్ర వాతావరణం కల్పించాలని కోరుతున్నారు.


