వియత్నాంలో మహిళా వ్యాపారవేత్తకు మరణశిక్ష

  వియత్నాంలో రియల్‌ ఎస్టేట్‌ మహిళా దిగ్గజ వ్యాపారవేత్తగా పేరుగాంచిన ట్రూంగ్‌ మై లాన్‌కు స్థానిక కోర్టు మరణశిక్ష విధించింది. ‘వాన్‌ థిన్‌ ఫాట్‌’ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ఛైర్మన్‌గా ఉన్న ఆమె సుమారు లక్ష కోట్ల మేర బ్యాంకును మోసం చేశారన్న కేసులో దోషిగా తేలారు. ఈ మొత్తం ఆ దేశ జీడీపీలో 3 శాతం. దీంతో ఆమెకు అక్కడి న్యాయస్థానం మరణశిక్ష విధిస్తూ తీర్పిచ్చింది. దేశంలో సంపన్న వ్యక్తుల్లో ఒకరిగా నిలిచిన ఆమెపై కోర్టు తీర్పు ఎలా ఉండబోతోందనే విషయంపై వియత్నాం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూసింది.

స్థానిక సైగాన్‌ జాయింట్‌ స్టాక్‌ కమర్షియల్‌ బ్యాంకును లాన్‌ అక్రమంగా తన ఆధీనంలోకి తీసుకుని 2012 నుంచి 2022 వరకూ 2500 రుణాలు తీసుకున్నారు. ఈ కారణంగా బ్యాంకుకు 27 బిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లింది. ఆమె డ్రైవర్‌ బ్యాంకు ప్రధాన కార్యాలయం నుంచి 4.4 బిలియన్‌ డాలర్ల నగదును లాన్‌ నివాసానికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. 2022లో ఈ కుంభకోణం బయటపడగా అదే ఏడాది అక్టోబరులో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. మరోపక్క 5.2 మిలియన్‌ డాలర్లను లంచంగా తీసుకున్నారన్న ఆరోపణలపై వియత్నాం కేంద్ర బ్యాంకు మాజీ అధికారి డొ థి న్హాన్‌కు జీవితకాల కారాగార శిక్షను న్యాయస్థానం విధించింది. ప్రస్తుతం వియత్నాంలో స్థిరాస్తి వ్యాపారం కుదేలైంది. కొనుగోలుదారు లను ఆకర్షించేందుకు పెద్దపెద్ద సంస్థలు భారీ ఎత్తున డిస్కౌంట్లను, బంగారం బహుమతులను అంది స్తామంటూ ప్రకటిస్తున్నాయి.

Latest Articles

అశాంతిగా విజయశాంతి

ఆమె సినీ రంగంలో లేడీ సూపర్ స్టార్. ఆ తర్వాత రాజకీయ రంగంలోను రాణించారు. ఎంపీగా పని చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. కానీ రాజకీయాల్లో యాక్టివ్ గా లేరు. ఫైర్ బ్రాండ్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్