సముద్రంలో ఇండియన్‌ నేవీ మరో ఆపరేషన్‌

   ఇరాన్‌కు చెందిన చేపల బోటు హైజాక్‌ కావడంతో ఇండియన్‌ నేవీ ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టింది. అందులో ఉన్న 23 మంది పాక్‌ పౌరులైన సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఇతర దేశాల నౌకలు రిస్క్‌లో ఉన్నప్పు డు రక్షించేందుకు ఎల్లప్పుడు ముందుండే భారత నేవీ మరోమారు సాహసం చేసింది. హిందూ మహా సముద్రం లో హైజాక్‌ అయిన ఇరాన్‌ చేపల బోటును, అందులో ఉన్న పాకిస్థాన్ కు చెందిన 23మంది సిబ్బందిని రక్షించింది. సముద్రాల్లో యాంటీ పైరసీలో భాగంగా ఈ ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

గల్ఫ్‌ ఏడెన్‌కు సమీపంలో ఉన్న సోకోట్రా ద్వీపానికి దగ్గర్లో ఇరాన్‌కు చెందిన చేపల బోటు హైజాక్‌కు గురైంది. తొమ్మిది మంది సముద్ర పైరేట్స్‌ పడవను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ బోటును, సిబ్బందిని రక్షించేం దుకు ప్రత్యేక ఆపరేషన్‌ చేపడుతున్నట్లు భారత నేవీ ప్రకటించింది. దీంతో తొలుత INS సుమేధా సముద్రపు దొంగల అదుపులో ఉన్న AI కంబార్‌ బోటును అడ్డగించింది. ఆ తర్వాత INS త్రిశూల్‌ నౌకదానికి తోడైంది. దాదాపు 12 గంటల ప్రత్యేక ఆపరేషన్‌ అనంతరం బోటులో ఉన్న పైరేట్లు లొంగిపోయారు. 23 మంది పాకిస్థాన్‌ జాతీయులు సురక్షితంగా బయటపడ్డట్లు నేవీ పేర్కొంది. రక్షించిన బోటును సురక్షిత ప్రాంతానికి తరలించడానికి భారత నేవీ ప్రత్యేక బృందాలు చర్యలు చేపట్టాయి. ఆ బోటు తిరిగి తన కార్యకలాపాలు కొనసాగించడానికి తనిఖీ లు చేసినట్లు అధికారులు తెలిపారు. భారత నేవీ సాహసాలు చేస్తూ పలు దేశాలకు చెందిన నౌకలకు అండగా నిలుస్తోంది.  

Latest Articles

ఈటల ఫ్లెక్సీ రచ్చపై స్పందించిన రామచందర్‌రావు.. కొందరు కుట్రలు చేశారు

ఈటెల రాజేందర్ మీద వచ్చిన అభియోగాలపై బీజేపీ తెలంగాణ అధ్యక్షులు రామ్ చందర్ రావు స్పందించారు. ఈటెల ఏడుపు బీజేపీకి శాపం అంటూ హైదరాబాద్ లో బ్యానర్లు, పోస్టర్లు వెలిశాయి. బ్యానర్లు, పోస్టర్లు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్