వరంగల్ ఎంపీ అభ్యర్థిపై బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. కడియం కావ్య వరంగల్ పార్లమెంటు స్థానం నుంచి తప్పుకో వడంతో బలమైన అభ్యర్థి కోసం బీఆర్ఎస్ వేట సాగిస్తోంది. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుద ర్శన్రెడ్డి సతీమణి పెద్ది స్వప్న పేరు తెరపైకి వచ్చింది. పెద్ది దంపతులతో అధిష్టానం సంప్రదిం పులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళ్లిన మాజీ డిప్యూటీ సీఎం, కడియం శ్రీహరికి చిరకాల రాజ కీయ శత్రువుగా ఉన్న తాటికొండ రాజయ్యను తిరిగి బీఆర్ఎస్లోకి తెచ్చేందుకు యోచిస్తు న్నారు. ఈ విషయంలో జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఇప్పటికే రాజయ్యతో మాట్లాడి నట్లుగా తెలుస్తోంది. రాజయ్య ఇంటికి వెళ్లి ఆయనతో చర్చించాలని కేసీఆర్ సూచనలు చేసి నట్లు రాజయ్య సన్నిహితులు చెబుతున్నారు.ఇదే సమయంలో వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తమకు అవకాశం కల్పించాలని కోరుతూ తెలంగాణ ఉద్యమకారులు, మాజీ కార్పొరేటర్లు బోడన్న, జోరిక రమేశ్ తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. వీరిద్దరు మొదట్నుంచి కడియం కావ్య ఎంపికను బాహాటంగానే తప్పుబ ట్టారు.