స్వతంత్ర వెబ్ డెస్క్: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో ఉన్న ఆరుగురు నిందితులకు రిమాండ్‌ను హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు పొడిగించింది. వీరిలో ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, దేవిరెడ్డి శంకర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలు ఉన్నారు. ఈ ఆరుగురికి రిమాండ్‌ను జూన్ 30వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. చంచలగూడ జైలులో ఉన్న ఈ ఆరుగురి రిమాండ్ ముగియడంతో పోలీసులు వీరిని ఈరోజు సీబీఐ కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ సందర్భంగా కోర్టు రిమాండ్ ను పొడిగించింది. మరోవైపు ఈ కేసులో మరో నిందితుడైన కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి బెయిల్ పై బయట ఉన్నారు. తెలంగాణ కోర్టు ఆదేశాల మేరకు ప్రతి శనివారం సీబీఐ అధికారుల ముందు విచారణకు హాజరవుతున్నారు.
వివేకా హత్య కేసులో ఆరుగురు నిందితులకు రిమాండ్ పొడగింపు
0
318
Previous article
Next article
Latest Articles
అశాంతిగా విజయశాంతి
ఆమె సినీ రంగంలో లేడీ సూపర్ స్టార్. ఆ తర్వాత రాజకీయ రంగంలోను రాణించారు. ఎంపీగా పని చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. కానీ రాజకీయాల్లో యాక్టివ్ గా లేరు. ఫైర్ బ్రాండ్...
- Advertisement -
- Advertisement -


