స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో సంచలనంగా మారిన మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు సీబీఐ అధికారులు. ఈ క్రమంలో కర్నూలు ఎస్పీతో చర్చలు జరుపుతున్నారు. ఎస్పీతో మాట్లాడుతూ.. అవినాష్‌ను లొంగిపోవాలని చెప్పాలంటూ ఎస్పీని కోరారు సీబీఐ అధికారులు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడేందుకు ఎస్పీతో వారు చర్చిస్తోన్నట్లు తెలుస్తోంది. అయితే ఈరోజు విచారణకు రావాలని అవినాష్ కు సీబీఐ నోటీసులు పంపగా… తాను విచారణకు రాలేనంటూ అధికారులకు లేఖ రాశారు అవినాష్. ఈ క్రమంలో సీబీఐ అధికారులు కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రికి చేరుకోవడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
‘అవినాష్‌ను లొంగిపోమనండి’.. కర్నూలు ఎస్పీతో సీబీఐ చర్చలు
0
735
Previous article
Next article
Latest Articles
మద్యం మత్తులో బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివారులోని ఓ బావిలో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. పల్నాడు జిల్లా వినుకొండ గ్రామానికి చెందిన...
- Advertisement -
- Advertisement -


