మహారాష్ట్రలో బోణీ కొట్టిన బీఆర్ఎస్.. సంబరాల్లో శ్రేణులు

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: టీఆర్ఎస్ నుంచి జాతీయపార్టీగా బీఆర్ఎస్ మారిన తర్వాత ఆ పార్టీ ఇతర రాష్ట్రాల్లో ప్రత్యేక దృష్టి పెట్టింది. తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ముఖ్యంగా మహారాష్ట్ర మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆ రాష్ట్రానికి చెందిన నాయకులను పార్టీలో చేర్చుకోవడంతో పాటు భారీ బహిరంగసభలు కూడా నిర్వహించారు. అంతేకాకుండా పార్టీ శ్రేణులకు శిక్షణా శిబిరం కూడా ఏర్పాటుచేశారు. అధినేత కృషితో ఆ పార్టీకి అక్కడ సానుకూల వాతావరణం ఏర్పడింది.

ఇటీవల ఔరంగాబాద్ జిల్లాలోని గంగాపూర్ తాలూకా అంబేలోహల్ గ్రామ పంచాయతీ ఒకటో వార్డుకు ఉప ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి గఫూర్ సర్దార్ పఠాన్ 115 ఓట్లతో గెలిచారు. దీంతో తెలంగాణ అవతల తొలి విజయాన్ని బీఆర్ఎస్ దక్కించుకుంది. ఈ విజయంపై బీఆర్ఎస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో తమ పార్టీ బలమైన ముద్ర వేయబోతోందనే దానికి ఈ విజయం నాంది పలకనుందని ఆశాభావంతో ఉన్నారు.

Latest Articles

దటీజ్.. మెగాస్టార్..

మెగాస్టార్ చిరంజీవి నాటి నుంచి నేటి వరుకు ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే.. యంగ్ హీరోలకు కూడా గట్టి పోటీ ఇచ్చేలా ఏమాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్