26.2 C
Hyderabad
Saturday, July 13, 2024
spot_img

తెలంగాణలో అమాంతం పెరిగిన కూరగాయల ధరలు

 మార్కెట్‌లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. సామాన్యుడి షాక్‌ ఇచ్చేలా అమాంతం పెరిగి ధరలు ఆకాశానికి చేరాయి. అధిక రేట్లతో టమోటా మోత మోగిస్తుంటే, ఉల్లి కన్నీళ్లు పెట్టిస్తోంది. ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలు పెరిగి ఆర్థిక భారం మోస్తుంటే ఉన్నట్టుండి ఒక్కసారిగా పెరిగిన కూరగాయల రేట్లు మరింత భారంగా మారాయి.

   కేవలం 15 రోజుల వ్యవధిలోనే ఉల్లి, టమాట సహా అన్ని కూరగాయల ధరలు 60శాతం అధికంగా పెరిగాయి. మే మూడో వారంలో కిలో 20 రూపాయలు ఉన్న ఉల్లి ప్రస్తుతం ప్రస్తుతం 40 రూపాలకు చేరింది. ఇక, టమాటా ధర కూడా రెండింతలు పెరిగిపోయింది. ప్రస్తుతం కిలో టమాటా 50కిపై మాటే పలుకుతోంది. వంకాయలు, బీన్స్, క్యారట్, బీట్‌రూట్, క్యాప్సికం, సొరకాయ, కాకరకాయ తదితరాల తోపాటు పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర ఇతర ఆకుకూరల ధరలు రెట్టింపయ్యాయి.

ప్రస్తుతం జనాభాకు సరిపడా కూరగాయాల పంట లేకపోవడంతో సుమారు 19 లక్షల టన్నుల దిగుబడుల కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోంది.దీంతో కూరగాయాల ధరలు ఆకాశాన్నంటాయి. మరోపక్క కూరగాయల ధరలు పెరగడానికి వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు కూడా ఓ కారణం. వడగాల్పుల కారణంగా రైతులు, వ్యాపారులు కూరగాయ లను ఎక్కడికక్కడే అమ్ముకోవడంతో మార్కెట్‌పై కూరగా యల కొరత ఏర్పడింది. ఈ క్రమంలో టమోటాలు, ఉల్లి దిగుమతి తగ్గి ధరలు పెరిగాయి. అలాగే, స్థానికంగా కూరగాయల ఉత్పత్తి 20% వరకు తగ్గింది. జూన్ మొదటి వారంలో వర్షాలు ప్రారంభంకావడం తో ఇతర ప్రాంతాల నుంచి తీసుకొస్తున్న కూరగాయలు తడిసి, త్వరగా కుళ్లిపోతున్నాయి. దీంతో వ్యాపారులు దిగుమతులను తగ్గించారు. ఇది కూడా కూరగాయల ధరలు పెరగడానికి ఓ కారణం.

    ఇక మొదటి అంతస్తులో సైతం లెఫ్ట్ సైడ్ సెంటిమెంట్ కొనసాగిందనే చెప్పుకోవాలి. TPCC ఫిషర్ మెన్ కమిటీ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కు స్టేట్ ఫిషరీస్ కో-ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ గా పదవి దక్కగా, బీసీ సెల్ చైర్మన్ గా ఉన్న నూతి శ్రీకాంత్ గౌడ్ కి బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవి, ఎస్సీ సెల్ చైర్మన్ గా ఉన్న నగరిగిరి ప్రీతం ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కించుకున్నారు. యూత్ కాంగ్రెస్ స్టేట్ చీఫ్ శివసేన రెడ్డి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ పదవి దక్కించుకోగా, బెల్లయ్య నాయక్ గిరిజన కో ఆపరేటివ్ ఫైనాన్స్ డెవెలప్ మెంట్ కార్పొరేషన్ ఉన్నత పదవి పొందారు. దివ్యాంగ కార్పొరేషన్ ఉన్నత పదవి విరయ్యకుదక్కింది. ఈ పదవులు దక్కించుకున్న నేతలు అంతా లెఫ్ట్ సైడ్ గదుల్లో సేవలు అందించిన వారే.

    లెఫ్ట్ సైడ్ గదుల్లో సేవలందించిన నేతలు ఉన్నత స్థానాలకు చేరడంతో, ఆ గదులు తమకు కేటాయిం చాలని పార్టీ కి చెందిన కొందరు నేతలు కర్చీఫ్ లో వేసేసి, ఆ రూమ్ లు దక్కించుకోవడానికి యత్నాలు సాగిస్తున్నట్టు సమాచారం. పదవుల కోసం పోటీపడడం చూశాం కాని రూముల గురించి పైరవీలు చేసే పరిస్థితి ఏమిటని, ఇదేం చోద్యమని కొందరు మెటికలు విరిచినా, నొసలు చిట్లించినా అవేవి పట్టించు కోకుండా సెంటిమెంట్ రూముల గురించి నేతలు తమ ప్రయత్నాలు సాగిస్తున్నారు. సీఎం నుంచి TPCC నేతల వరకు కలసి వచ్చిన విశ్వాసం తమకు సైతం ఉడతా భక్తి మాదిరి సాయం కాకపోతుందా అనే భావనలో ఈ నేతలు ఉన్నట్టు తెలిసింది.

Latest Articles

రాజ్‌ తరుణ్‌- లావణ్య కేసులో మరో ట్విస్ట్‌

తనను ప్రేమించి మోసం చేశాడంటూ నటుడు రాజ్‌తరుణ్‌పై ఇటీవల ఫిర్యాదు చేసిన లావణ్య.. ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ అర్ధరాత్రి తన అడ్వకేట్‌కు మెసేజ్ పంపారు. తాను వెళ్లిపోతున్నానంటూ అందులో పేర్కొన్నారు. దీంతో అడ్వకేట్‌ .....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్