శృతి హాసన్ అంటే.. ఒకప్పుడు ఐరెన్ లెగ్ అనే వారు.. ఆతర్వాత గోల్డెన్ లెగ్ అనే పేరు తెచ్చుకుంది. తెలుగులో శృతి సినిమా చేసిందంటే.. ఆ మూవీ బ్లాక్ బస్టరే అనేంతగా సక్సెస్ సాధించింది. అయితే.. తనకు వచ్చిన ఆఫర్స్ కు అన్నింటికీ ఓకే చెప్పకుండా ఆచితూచి సినిమాలు ఒప్పుకుంటుంది. అయితే.. శృతి తన ఆశ నెరవేర్చుకునేందుకు పెద్ద ప్లానే రెడీ చేసింది. ఇంతకీ.. శృతి ఆశ ఏంటి..? దీని కోసం రెడీ చేసిన ప్లాన్ ఏంటి..?
తెలుగు, తమిళ్, హిందీ చిత్రాల్లో నటించిన శృతి హాసన్ హాలీవుడ్ లో సినిమాలు చేయాలి.. గ్లోబల్ రేంజ్ లో క్రేజ్ సంపాదించాలని ఎప్పటి నుంచో ఆశపడుతుంది. ఇప్పుడు సైకలాజికల్ థ్రిల్లర్ ది ఐ సినిమాతో గ్లోబల్ ఆడియన్స్ కు పరిచయం కాబోతున్నారు. ఫిబ్రవరి 27 నుండి మార్చి 2 వరకు జరిగే హర్రర్, సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ చిత్రాల 5వ వెంచ్ ఫిల్మ్ ఫెస్టివల్ గ్రాండ్ గా జరగనుంది. ఈ ఈవెంట్ లో ఫ్రారంభ ఫీచర్ గా ది ఐ చిత్రాన్ని ఇండియా తరుపున ప్రీమియర్ కానుంది. ది ఐ కథ విషయానికి వస్తే..
డయానా పాత్ర పోషించిన శృతి హాసన్ తన భర్త ఫెలిక్స్ కోసం చేసే ప్రయాణమే ఈ కథ. చనిపోయిన తన భర్తను మళ్లీ తిరిగి తీసుకు వచ్చేందుకు వచ్చే ప్రయత్నాలు ఎంతో ఆసక్తిగా ఉండబోతోన్నాయని టీజర్ చూస్తేనే అర్థం అవుతోంది. తన భర్తను వెనక్కి తిరిగి తెచ్చకునేందుకు భార్య చేసి త్యాగాలు ఏంటి? ప్రయత్నాలు ఏంటి? అన్నది ఆసక్తికరంగా మారింది.
గ్రీస్, ఏథెన్స్, కోర్ఫులోని అందమైన లొకేషన్‌లో చిత్రీకరించిన సీన్లు ఆడియెన్స్‌ను మెప్పించేలా ఉన్నాయి. 2023లో లండన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో, గ్రీక్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ది ఐ మూవీని ప్రదర్శించిన తర్వాత ప్రాజెక్ట్ పై అందరిలోనూ ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. సైకలాజికల్ థ్రిల్లర్‌లు ఎప్పుడూ ఆకర్షిస్తూనే ఉంటాయి. మానవ భావోద్వేగాలు, దుఃఖం, అతీంద్రియ శక్తులు వంటి కాన్సెప్ట్‌లతో తీసే సినిమాలంటే తనకు ఇష్టమని శృతి హాసన్ తెలియచేసింది. మొత్తం మహిళల నేతృత్వంలోని ప్రొడక్షన్ హౌస్‌లో ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించడం విశేషం. చలనచిత్ర పరిశ్రమలో మహిళలకు మద్దతు ఇవ్వాలనే అభిరుచికి అనుగుణంగా ఈ ప్రాజెక్ట్ ఉంటుంది శృతి చెప్పారు. ది ఐ సినిమాలోని పాత్ర శృతి హాసన్‌కు అద్భుతంగా అనిపిస్తుంది. ఎమోషన్స్, సంఘర్షణ ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌ను చూపించే డయానా పాత్రలో శృతి హాసన్ చక్కగా నటించారని అభినందించారు డైరెక్టర్ డాఫ్నే ష్మోన్. మరి.. ఈ హాలీవుడ్ మూవీతో శృతి ఆశ నెరవేరుతుందేమో చూడాలి.


