క్యాన్సర్.. ఆ పేరు వింటేనే వెన్నులో వణుకుపుడుతుంది. ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకపోయినా.. క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుందో.. ఎలా నయమవుతుందో.. అసలు నయం అవుతుందో లేదో కూడా ఇటు డాక్టర్లకు కానీ.. సంబంధిత నిపుణులు కానీ ఏ మాత్రం చెప్పలేని వ్యాధి అది. క్యాన్సర్‌కు ట్రీట్‌మెంట్ ఉంది.. కానీ నయం అవుతుందని గ్యారంటీ చెప్పలేమంటారు వైద్యులు. క్యాన్సర్‌లో చాలా రకాలు ఉన్నాయి. బయోప్సీలో క్యాన్సర్ ఉందని నిర్ధారించుకుంటే.. కీమో థెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ, రేడియేషన్ ఇలా .. శరీరంలో ఉన్న ట్యూమర్‌ను చంపడానికి ట్రీట్‌మెంట్ చేస్తుంటారు. క్యాన్సర్ వచ్చిందని తెలియగానే మనిషి సగం చచ్చిపోతాడు. మిగతా సగం ఈ ట్రీట్‌మెంట్ బాధతో చచ్చిపోతాడు.
క్యాన్సర్ అనేది అసాధారణ కణాల పెరుగుదలతో కూడిన సమూహం. ఎంత వైద్యం చేసినా కానీ క్యాన్సర్‌ను ట్రీట్ చేసే అంకాలజిస్ట్ మాత్రం ఇది నయమవుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పలేరు. మనిషి చంద్రుడిపైకి వెళ్తున్న రోజులివి. కానీ ఇంకా క్యాన్సర్ అనే వ్యాధికి పూర్తిగా నయమవుతుంది .. అని చెప్పగలిగే ట్రీట్‌మెంట్ మాత్రం కనుక్కోలేకపోయారు.
అయితే క్యాన్సర్ అనే పదమే అబద్ధమని.. క్యాన్సర్ భూతం పేరు చెప్పి ప్రపంచాన్ని భయపెడుతున్నారనే వాదనలు కూడా ఉన్నాయి. క్యాన్సర్ అనేది నివారణ లేని జబ్బు కాదు… ఇది ఒక భయంకరమైన బిజినెస్ అని చాలా మంది అంటుంటారు. క్యాన్సర్ అనేది B17 లోపమే గాని జబ్బు కాదని .. World without CANCER అనే పుస్తకంలో చెప్పబడింది. దీన్ని అన్ని భాషల్లోకి ట్రాన్స్‌లేషన్ జరగకుండ అడ్డుపడుతున్నారనే వాదనలు కూడా లేకపోలేదు. ఈ లోపాన్ని అణచడానికి కీమోథెరపీ అని, సర్జరీ అని, హై డోస్ మెడిసిన్ ఇచ్చి సైడ్ ఎఫెక్ట్స్ తో మనిషిని చంపకుండా చంపేస్తున్నారని అంటున్నారు.
గతంలో స్కర్వీ వ్యాధి వచ్చినప్పుడు కూడా .. అది విటమిన్ లోపం వల్ల వచ్చిన రోగం అని చెప్పకుండా… అంతుపట్టని రోగం అని చెప్పి ప్రజల నుండి ఆస్పత్రులు దోచుకున్నాయని చెబుతారు. ఇప్పుడు కూడా క్యాన్సర్ పేరు చెప్పి అలాగే దోపిడీకి ఆస్పత్రులు పాల్పడుతున్నాయని కూడా వాదిస్తున్నారు. క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే విటమిన్ బీ17 ఎక్కువగా ఉన్న ఆహార పదార్ధాలు తీసుకోవాలని World without CANCER పుస్తకంలో రాసి ఉంది.
క్యాన్సర్ రాకుండా చేసుకోవడం చాలా సులువు
15 నుండి 20 నేరెడు కాయలు
క్రాన్బెరి/ఆపిల్ సీడ్స్
ఎండు ద్రాక్ష
బాదాం పప్పు
బ్లాక్ మల్బెర్రి, బ్లూ మల్బెర్రి, కోరిందకాయ స్ట్రాబెర్రి
నువ్వులు, అవిసె గింజలు
ఓట్స్, బార్లీ, గోధుమ బియ్యం, నల్ల గోధుమలు
బీర్ ఈస్ట్, వరి, తీపి గుమ్మడికాయ. తెల్ల ఆపిల్ (పియర్ ఆపిల్)
నిమ్మ, ఉసిరి, చిక్కుడు, గోధుమ గడ్డి
జీడీపప్పు, పిస్తా
ఇవన్నీకూడా అధిక శాతంలో విటమిన్ B17కలిగి ఉన్న పదార్థాలే. ఇంకా గోధుమ మొలకలు .. అద్భుతమైన క్యాన్సర్ నిరోధక మందుగా పనిచేస్తుందట. రోజూ ఒక తులసి ఆకు తింటే జీవితంలో ఎలాంటి క్యాన్సర్లు దరిచేరవట.