ఇవాళ పల్నాడు జిల్లాలో జగన్‌ మేమంతా సిద్ధం యాత్ర

     ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. సీఎం జగన్‌ దూకుడు పెంచారు. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టి రాష్ట్రం చుట్టేస్తున్నారు. ఉదయం ముఖాముఖి, మధ్యాహ్నం బహి రంగ సభలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారమే లక్ష్యంగా జగన్‌ ప్రచారంతో హోరె త్తిస్తున్నారు. మేమంతా సిద్ధం 12వ రోజుకు చేరుకుంది. నిన్న ఉగాది సందర్భంగా ఒక రోజు బ్రేక్ తీసు కున్న జగన్‌.. ఇవాళ మంగళవారం రాత్రి బస చేసిన గంటావారిపాలెం వద్ద నుంచి యాత్ర ప్రారంభిం చారు.

     పుట్టవారిపాలెం, సంతమాగులూరు క్రాస్, రొంపిచర్ల క్రాస్, విప్పెర్ల, నెకరికల్లు మీదుగా దేవరంపాడు క్రాస్‌ వద్దకు చేరు కుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కొండమోడు, పిడుగురాళ్ల బైపాస్‌ మీదుగా సాయంత్రం 3.30 గంటలకు అయ్యప్పనగర్‌ బైపాస్‌ వద్దకు చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం కొండమోడు జంక్షన్, అనుపాలెం, రాజుపాలెం, రెడ్డిగూడెం మీదుగా ధూళిపాళ్ల దగ్గర రాత్రి బస శిబిరానికి చేరు కుంటారు. గుంటూరు నగరంలో ఈనెల 12న ‘మేమంతా సిద్ధం’ సభ జరుగుతుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. 12వ తేదీ ఉదయం జగన్‌ చేపట్టిన బస్సు యాత్ర సత్తెనపల్లి, మేడికొండూరు, పేరేచర్ల, నల్లపాడు, చుట్టుగుంట సెంటర్, వీఐపీ రోడ్‌ మీదుగా ఏటుకూరు చేరుకోనుంది. అక్కడ జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్‌ మాట్లాడతారు. రాత్రికి గుంటూరు జిల్లాలోనే సీఎం జగన్‌ బస చేస్తారు. 13వ తేదీ ఉదయం ఎన్టీఆర్‌ జిల్లాలోకి బస్సు యాత్ర ప్రవేశించనుంది.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్