మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు (CCM) పసునూరి నరహరి అలియాస్ విశ్వనాథ్, అతని భార్య మేదర దానమ్మ పోలీసుల ఎదుట లొంగిపోయారు. నరహరి స్వస్థలం హనుమకొండ జిల్లా సోమిడి గ్రామం. ఆయుధాలు, రాకెట్లు, బూబీ ట్రాప్స్ తయారీలో నైపుణ్యం కలిగి ఉన్నారు. 1982లో మావోయిస్టు దళంలో చేరి దండకారణ్యం, బీహార్, జార్ఖండ్ ప్రాంతాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. 2017లో కేంద్ర కమిటీ సభ్యుడిగా (CCM) పదోన్నతి పొందారు. దానమ్మ స్వస్థలం గుంటూరు జిల్లా గామలపాడు గ్రామం. ప్రస్తుతం రాష్ట్ర కమిటీ సభ్యురాలు (SCM).1986లో ఉద్యమంలో చేరి, 2004లో అరెస్ట్ అయ్యి, 2011లో బెయిల్‌పై విడుదలై మళ్లీ పార్టీలో చేరారు. తెలంగాణ పునరావాస విధానం కింద నరహరికి రూ.25 లక్షలు, దానమ్మకు రూ.20 లక్షలు డీడీ రూపంలో అందజేశారు.
మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. నరహరి లొంగుబాటు
0
47
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


