విశాఖ పర్యటన.. వైఎస్సార్‌ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం జగన్

స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: విశాఖపట్నంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పర్యటించనున్నారు. పలు అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవంతో పాటు వైఎస్సార్‌ విగ్రహాన్ని ఆవిషరించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి విశాఖకు బయలుదేరతారు. పీఎం పాలెం వైఎస్సార్‌ స్టేడియంకు సాయంత్రం 3.50 గంటలకు చేరుకుంటారు. అనంతరరం అక్కడ ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ విగ్రహాన్ని ఆవిష్కరించి సాయంత్రం 4.50 గంటలకు ఆరిలోవలోని అపోలో కేన్సర్‌ ఆస్పత్రిని ప్రారంభిస్తారు. సాయంత్రం 5.50 గంటలకు వీఎంఆర్డీఏ అభివృద్ది చేసిన సీ హారియర్‌ యుద్ద విమాన మ్యూజియంను ప్రారంభింస్తారు. రామ్‌ నగర్‌లోని వీఎంఆర్డీఏ కాంప్లెక్స్, ఎంవీపీలోని ఇండోర్‌ స్పోర్ట్స్‌ ఎరీనాను ప్రారంబిస్తారు. ఆ తర్వాత ఎండాడలోని కాపు భవనం, భీమిలిలోని ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ కు శంకుస్ధాపన చేస్తారు. అనంతరం సా. 6.15 గంటలకు ఏయూ కన్వెన్షన్‌ హాల్లో ఎమ్మెల్యే గొల్ల బాబురావు పుత్రుడి వివాహ రిసెప్షన్‌ వేడుకలో పాల్గొని తిరిగి రాత్రి 8.20 గంటలకు తాడేపల్లికి ప్రయాణమవుతారు.

Latest Articles

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్‌లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్