20.7 C
Hyderabad
Thursday, January 23, 2025
spot_img

వీడని ట్రయాంగిల్‌ సూసైడ్‌ మిస్టరీ.. కామారెడ్డి క్రైం కథా చిత్రమ్‌

పూటకో మలుపు… రోజుకో అప్‌డేట్… ఇది కామారెడ్డి ట్రై యాంగిల్ సూసైడ్ కేసు. డెత్ మిస్టరీ సస్పెన్స్‌గానే కొనసాగుతోంది. ముగ్గురూ సూసైడ్ చేసుకున్నారా…? ఎవరైనా బ్లాక్ మెయిల్ చేసి ప్రాణాలు తీసుకునేలా ఉసిగొల్పారా…? పోలీసుల విచారణలో ఏం తేలింది…? మృతుల కాల్ డేటా ఏం చెబుతోంది…? వాట్సాప్ చాట్ కీలకంగా మారిందా…? పోలీసులకు ఏమైనా క్లూ దొరికిందా…? కామారెడ్డి క్రైం కథా ఎప్పటికి కొలిక్కి వచ్చేనూ…?

కామారెడ్డిలో ముగ్గురు వ్యక్తుల సూసైడ్ తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. సూసైడ్ చేసుకున్న ముగ్గురిలో ఓ ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్ ఉండటంతో పోలీసులు సక్రమంగానే విచారణ జరుపుతారా లేక తూతూ మంత్రంగా దర్యాప్తు చేసి చేతులు దులుపుకుంటారా అన్న అనుమానాలు సైతం వ్యక్తం అయ్యాయి. అందుకు తగ్గట్లుగానే ఘటన జరిగి 8 రోజులు కావొస్తున్నా… ట్రైయాంగిల్ డెత్ మిస్టరీకి సంబంధించి సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఎస్ఐ సాయి కుమార్, మహిళా కానిస్టేబుల్ శృతి, ఆపరేటర్ నిఖిల్ మృతిపై ఎన్నో అనుమానాలున్నాయి. ముగ్గురు మృతి కేసులో విభిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని కామారెడ్డి పోలీసులు చెబుతున్నారు.

ట్రై యాంగిల్ డెత్ మిస్టరీ పురోగతికి సంబంధించి కామారెడ్డి పోలీసులపై ఒత్తిడి పెరుగుతుంది. సైబర్ ఫోరెన్సిక్ రిపోర్ట్ కీలకంగా మారనుంది. కేసు దర్యాప్తులో అంతా ఊహాగానాలే వ్యక్తం అవుతున్నాయి. ముగ్గురి ఫోన్ కాల్ హిస్టరీ, వాట్సాప్ చాటింగ్ కీలకంగా మారింది. చనిపోయే రోజు భిక్కనూరు ఎస్ఐ సాయికుమార్, బీబీ పేట కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ఫోన్‌లో గంటలకొద్దీ మాట్లాడుకున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరు ముగ్గురు గత నెల 25న కామారెడ్డి సమీపంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువులో నీటమునిగి చనిపోయారు. బుధవారం వేకువజాము నుంచే వీరి ఫోన్‌లో మాట్లాడుకున్నట్లు కాల్ డేటా ద్వారా స్పష్టమైంది. సాయికుమార్ రెండు ఫోన్లలో కలిపి మూడు సిమ్ కార్డులు వినియోగించగా… నిఖిల్ రెండు ఫోన్లు వాడాడు. శృతి ఒక ఫోన్ వాడుతుండేది. చనిపోయే వారం రోజుల ముందు నుంచి ముగ్గురు ఎక్కువ ఫోన్‌లు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది.

వారం రోజులుగా సాగిన ఫోన్ సంభాషణలు… బుధవారం రోజు ఒక్క దగ్గరికి చేరుకునే వరకు మాట్లాడుకున్నట్లు గుర్తించారు. జిల్లా అధికారులతో ఫోన్ కాన్ఫరెన్స్‌లో ఉన్న సమయం మినహా… మిగతా సమయం అంతా శృతి, నిఖిల్‌తో సాయికుమార్ ఫోన్‌లో మాట్లాడుతూనే ఉన్నట్లు తెలుస్తోంది. వీరి మధ్య ప్రేమ వ్యవహారం ఉన్నట్టు వాట్సాప్ మెసేజ్‌లు స్పష్టం చేస్తున్నాయని పోలీస్ వర్గాల ద్వారా తెలిసింది. అయితే వీరి ప్రేమ వ్యవహారంలో సాయికుమార్ ఎందుకు తలదూర్చాడన్నది కీలకంగా మారింది. నిఖిల్, శృతి పెళ్లి చేసుకోవాలనుకున్నారని… కానీ విబేధాలు తలెత్తి పెళ్లి వాయిదా వేయడం వల్లే గొడవ ముదిరిందన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ట్రైయాంగిల్ లవ్ స్టోరీలో ప్రధాన విలన్ ఎస్ఐ సాయికుమార్ అని స్థానికులు చెవులుకొరుక్కుంటున్నారు. కానీ సాయి కుమార్‌ని హిరోగా చేయడానికే పోలీసులు విచారణలో కాలయాపన చేస్తున్నారన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి.

కామారెడ్డి ట్రైయాంగిల్ సూసైడ్‌ను ప్రత్యక్షంగా ఎవరూ చూడలేదని… అందుకే కేసులో పురోగతి లేదని ఎస్పీ సింధు శర్మ తెలిపారు. అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువులో ఆత్మహత్యలకు గల కారణాలను విచారణ చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. అవి ఆత్మహత్యలా, ప్రమాదకరంగా జరిగిందా అనే కోణంలో విచారణ చేస్తున్నామన్నారు. మొబైల్ ఫోన్ సంభాషణల ఆధారంగా ఆ ముగ్గురు చెరువు దగ్గరకు వెళ్లినట్టు తెలుస్తుంది. ఆత్మహత్యలకు సంబంధించి మొబైల్ ఫోన్లు, నీటి నమూనాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపడం జరిగిందని ఎస్పీ సింధు శర్మ చెప్పారు.

చెరువులోకి ముగ్గురూ ఒకేసారి దూకారా…? ఒకరు చెరువులోకి దూకడంతో… కాపాడేందుకు మిగతా ఇద్దరు వెళ్లి మృతిచెందారా…? గతంలో ప్రాణహాని ఉందని నిఖిల్ చేసిన ఫిర్యాదుకి ఆత్మహత్యలకు ఏమైనా సంబంధం ఉందా…? ట్రైయాంగిల్ డెత్ మిస్టరీ వెనకుంది… ట్రైయాంగిల్ లవ్ స్టోరీనా…? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా కొనసాగుతున్న ట్రైయాంగిల్ సూసైడ్ కేసు ఎప్పటికి కొలిక్కి రానుందో.

Latest Articles

కృత్రిమ మేథను ప్రశంసిచాలా..? అభిశంసించాలా..?

ఏమిటో ఈ మాయ అనుకున్నా, ఇదేం వింత అనుకున్నా....ఇందు, అందు, ఎందెందు చూసినా హాయ్ అంటూ ఏఐ పలకరించే పరిస్థితులు వచ్చేస్తున్నాయి. ఏదైనా ఒరిజనల్ ఉండాలి కాని ఆర్టిఫిషియల్ ఏమిటి..అని పెదవి విరిచేవారు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్