TSRTC: దసరా పండుగకు తెలంగాణ ఆర్టీసీ కొత్త ఆఫర్

స్వతంత్ర వెబ్ డెస్క్: దసరా సీజన్ వచ్చిందంటే ఆర్టీసీ బస్సులు కిటకిటలాడిపోతుంటాయి. దాంతో తెలుగు రాష్ట్రాల ఆర్టీసీలు వందల సంఖ్యలో స్పెషల్ బస్సులు ఏర్పాటు చేస్తుంటాయి. ఎక్కడెక్కడో స్థిరపడినవాళ్లు, వలస జీవులు విజయదశమి వేళ సొంతూర్లకు పయనమవుతుంటారు కాబట్టి భారీ రద్దీ తప్పదు. ఆదాయం భారీగా పెంచకునేందుకు ఈ పండుగ సీజన్ ఆర్టీసీలకు మంచి అవకాశం. ఈ నేపథ్యంలో ప్రయాణికులను మరింతగా ఆకర్షించేందుకు టీఎస్ఆర్టీసీ వినూత్న చర్యలు తీసుకుంటోంది. దసరా సీజన్ లో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారికి లక్కీ డ్రా నిర్వహించనుంది. ఈ లక్కీ డ్రా ఎలా ఉంటుందంటే… ఆర్టీసీ బస్సులో ఎక్కిన ప్రయాణికులు తమ ప్రయాణం పూర్తయిన తర్వాత టికెట్ పై తమ పూర్తి పేరు, ఫోన్ నెంబరు రాసి బస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్ ల్లో వేయాల్సి ఉంటుంది.

110 మందిని లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేస్తారు. ప్రతి రీజియన్ నుంచి 10 మందికి లక్కీ డ్రాలో గెలుపొందే అవకాశం ఉంటుంది. లక్కీ డ్రా కింద ఐదుగురు మహిళలు, ఐదుగురు పురుషులను ఎంపిక చేస్తారు. ఒక్కొక్కరికి రూ.9,900 చొప్పున బహుమతి లభిస్తుంది. అక్టోబరు 21 నుంచి 23వ తేదీ వరకు…. అక్టోబరు 28 నుంచి 30వ తేదీ వరకు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి ఈ లక్కీ డ్రా వర్తిస్తుంది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. పూర్తి వివరాల కోసం 040-69440000, 040-23450033 నెంబర్లను సంప్రదించాలని తెలిపారు.

Latest Articles

మీనాక్షి సెంటిమెంట్ మళ్లీ నిజమయ్యేనా..?

ఒక్కొక్కరికి ఒక్కొ సెంటిమెంట్ ఉంటుంది.. అదే సినీ జనాలకు అయితే.. ఈ సెంటిమెంట్ కాస్త ఎక్కువుగానే ఉంటుంది. మేటర్ ఏంటంటే.. ఇండస్ట్రీలో మీనాక్షి సెంటిమెంట్ ఒకటి ఉంది. దీంతో యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ.....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్