26.7 C
Hyderabad
Saturday, May 9, 2026
spot_img

బెంగాల్ లో టీఎంసీ ఒంటరి పోటీ

      లోక్ సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ లో 42 స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులను తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. రాష్ట్రంలో ఒంటరిగానే టీఎంసీ పోటీ చేస్తుందని మమతా బెనర్జీ వెల్లడించారు. దీంతో ఇండియా కూటమిలో ఏ పార్టీకీ ఒక్క సీటు కూడా ఇవ్వబోవడం లేదని మరోసారి స్పష్టమైంది. కోల్ కతా బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన మెగా ర్యాలీలో తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. “జనగర్జన సభ” సభలోనే మమతా బెనర్జీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. బెంగాల్ లో టీఎంసీ తరుపున పోటీచేసే 42 మంది అభ్యర్థులను ఈ సందర్భంగా పరిచయం చేశారు. అసోం, మేఘాలయ లోనూ టీఎంసీ అభ్యర్థులు పోటీ చేస్తారని మమతా బెనర్జీ ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ లోనూ ఒక స్థానానికి పోటీ చేయనున్నట్లు తెలిపారు.మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ ను బహరంపూర్ టీఎంసీ అభ్యర్థిగా ప్రకటించారు. గత లోక్ సభలో పార్లమెంటులో ప్రశ్నలు సంధించేందుకు అక్రమాలకు పాల్పడిన ఆరోపణతో సభ్యత్వం కోల్పోయిన మహువా మొయిత్రా కు తిరిగి టీఎంసీ టికెట్ లభించింది. కిషనగర్ నుంచి ఆమె పోటీ చేస్తారు.

Latest Articles

కేటీఆర్‌లో పెరుగుతున్న ఫ్రస్ట్రేషన్‌తో బీఆర్ఎస్‌కు ఇబ్బందులు తప్పవా?

తెలంగాణ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం హద్దులు దాటుతోంది. పదేళ్ల పాటు అధికారంలో ఉండి, ఇప్పుడు ప్రతిపక్షానికే పరిమితమైన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్