30.2 C
Hyderabad
Wednesday, April 17, 2024
spot_img

మేదరమెట్ల సిద్ధం సభలో జగన్ గర్జన

     అద్దంకి నియోజకవర్గంలోని మేదర మెట్ల సిద్ధం సభలో జన సంద్రం పోటెత్తింది. దీంతో ఏపీ రాష్ట్ర రాజకీయం మరింత వేడెక్కింది. ప్రతిపక్షాల కూటమిపై సీఎం జగన్ విమర్శల విసుర్లతో కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.ప్రత్యర్థి పార్టీలు మదన పడేలా జనం సంద్రం వెల్లువెత్తింది. సీఎం జగన్ వైసీపీ కేడర్‌లో ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని నింపారు. మేదరమెట్ల సిద్ధం సభతో ప్రతిపక్షాలకు ముచ్చెమటలు పట్టించారనే చెప్పాలి. ఇప్పటి వరకు మూడు సిద్ధం సభలు జరిగాయి.

     ఇది నాలుగో సిద్ధం సభ … ఈ సభకు దాదాపు 15 లక్షల మంది వైసీపీ కార్యకర్తలు హాజరయ్యారని తెలుస్తోంది. మొదటిది విశాఖ భీమిలిలో జరగ్గా … రెండోది ఏలూరు దెందులూరులో ప్రభంజనం వెల్లువెత్తింది. మూడోది అనంతపురం రాఫ్తాడులో సిద్ధం సభ విజయవంతమైంది. ఈ మూడు సిద్ధం సభలకు లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు. ఇక నాలుగో సిద్ధం సభ మేదమెట్లలో జరిగింది. ఈ సభలో సీఎం ప్రసంగం.. ప్రజలను ఉర్రూతలూగించింది …. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ప్రతీ హామీ నెరవేర్చిందని చెప్పారు. గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని… ప్రజలను మోసం చేశారని, ప్రజలకు మరోసారి గుర్తు చేశారు.

    టీడీపీ పలు రాష్ట్రాల్లోని పథకాలను తెచ్చి కిచిడీ మేనిఫెస్టోని మీ ముందుకు తెచ్చిందని సీఎం జగన్ చంద్రబాబుని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం పాలనలో నవరత్నాల ద్వారా వచ్చిన పథకాలు నేరుగా ప్రజల ఖాతాల్లోకి చేరాయని సీఎం జగన్ అన్నారు. ఎటువంటి అవినీతి లేకుండా ప్రజలకు పథకాలు అందించామని చెప్పారు. ఏడాదికి 75 వేల కోట్లు ప్రజాసంక్షేమం కోసం ఖర్చు చేశామన్నారు. చంద్రబాబు ప్రజలని మోసం చేయడానికే కుతంత్రాలు చేస్తున్నారని సీఎం జగన్ విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో తాను 58నెలల్లో 130 సార్లు బటన్ నొక్కానన్నారు.ఫలితంగా రెండు లక్షల 70 వేల కోట్లు నేరుగా ప్రజల ఖాతాల్లోకి చేరాయని చెప్పారు. కూటమి కి ఓటు వేస్తే పేదల బతుకు అంధకారం అవుతుందని వ్యాఖ్యానించారు…తననే గెలిపించాలని గడప గడపకు చెప్పాలని వైసీపీ కార్యకర్తలను ఉత్సాహప రిచారు.

   అరడజను పార్టీలు తనను ఒక్కడిని చేసి తనపై అరడజను బాణాలు ఎక్కుపెట్టాయని అన్నారు…మీ అన్న సింహంలా ఒక్కడిగా పోటీ పడుతున్నాడని….తాను ప్రజలను మాత్రమే నమ్ముకున్నానని చెప్పారు. సీఎంగా అన్న వస్తేనే ఇంటింటికి చిరునవ్వులు పూస్తాయని చెప్పమన్నారు…. మళ్లీ సీఎంగా అన్న వస్తేనే …చిన్నారులతో బళ్లు కళకళలాడుతాయన్నారు. వైసీపీ ప్రభుత్వం ఇచ్చే పథకాలు సజావుగా సాగాలంటే అన్న మళ్లీ రావాలని ప్రతిఇంటికి వెళ్లి చెప్పమని స్టార్ కేంపియన్ చేయమని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.

    చంద్రబాబు కు ఓటేస్తే ఈ పథకాల రద్దుకు మీరే అమోదం తెలిపినట్టవుతుందని చెప్పమని కార్యకర్తలను కోరారు…. చంద్రబాబు కు ఓటేస్తే లంచాల రాజ్యం వస్తుందని చెప్పారు… మళ్లీ టీడీపీ వస్తే వాలంటీర్ల వ్యవస్థ రద్ధవుతుందన్నారు. బాబుకు ఓటు వేస్తే … ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్లకు అమ్ముకోవడమేనని చెప్పమని కార్యకర్తలను కోరారు. తాను చేసిన మంచిని చూపించి, ఓటు అడుగుతు న్నానని అన్నారు… తాను మంచి చేసుంటేనే ఓటెయ్యమని ప్రజలను కోరారు. ఇన్ని పథకాలతో ప్రజల సంక్షేమానికి పెద్ద పీట వేసిన ప్రభుత్వానికి గతంలో కంటే మెజారిటీని ఇవ్వాలని కోరారు. 175 సీట్లకు 175 సీట్లు ప్రజలు గెలిపించాలని పిలుపిచ్చారు. అలాగే 25 ఎంపీ సీట్లు గెలిపించాలని ప్రజలకు సూచిం చారు. 2019 ఎలక్షన్ నాటి విజయానికి మించి విజయం వైసీపీకి చేకూర్చాలని కార్యకర్తలకు సూచిం చారు.

 జగన్ మాట ఇస్తే తగ్గేదే లేదని ప్రజలకు భరోసా ఇచ్చారు . ఏపీలో వైసీపీ పాలన స్వర్ణయుగానికి దారి తీస్తుందని భావించారు… పేద వారి పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో చదివేలా తీర్చిదిద్దడం తన కలని ప్రకటించారు. వ్యవసాయాన్ని కూడా మార్చాలనేది తన కలని చెప్పారు. పేదవాళ్లకు సమాన హక్కులు అవకాశాలు దక్కాలని ఆయన సిద్ధం సభలో వెల్లడించారు. వైద్యం కోసం ప్రజలు అప్పులు పాలవ్వ కూడదని …ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితి రాకూడదని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు. మహిళా సాధికారత సాధించాలని … సామాజిక న్యాయానికి పెద్దపీట వేసానని చెప్పారు.

     పేదవాడి భవిష్యత్తు తన వల్లే మారాలని కోరుకుంటున్నట్టు సీఎం జగన్ ప్రకటించారు. జగన్ ను ఓడించేందుకు ప్రతిపక్షాలు కూటమిగా మూకుమ్మడిగా వస్తున్నాయన్నారు.వైసీపీ మాత్రం పేదలను గెలిపించడానికి కృషి చేస్తుందన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలది కృష్ణుడి పాత్రని….తనది అర్జునుడి పాత్రని చెప్పారు. పార్టీల పొత్తులతో పేదలని ఓడించడానికి చంద్రబాబు వస్తున్నాడన్నారు. ప్రజలే బలం గా వైసీపీ ముందుకు కొనసాగుతుందని చెప్పారు.ప్రజలు తమ ఓటు అస్త్రం ప్రయోగించాల్సిన సమయం ఆసన్నమైందని ప్రజలను పిలుపునిచ్చారు.ఇప్పుడు ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి పరిధికి సంబంధించి బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో నాల్గో సభను.. ఆఖరి సిద్ధం సభగా నిర్వ హించారు. భీమిలీ, దెందులూరు, రాప్తాపాడులో జరిగిన సభలు రాష్ట్రంలో వైసీపీ దమ్మును, ప్రజా దరణను తెలియజేసింది. ఈ నాలుగో సభ కూడా ప్రత్యర్ధుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తేలా నిర్వహిం చింది వైసీపీ.

Latest Articles

చియాన్ విక్ర‌మ్ 62వ చిత్రం ‘వీర ధీర శూరన్’ టైటిల్ టీజర్ రిలీజ్

విలక్ష‌ణ‌మైన సినిమాలు, వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌టమే కాకుండా జాతీయ ఉత్త‌మ న‌టుడిగానూ త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న యాక్ట‌ర్ చియాన్ విక్ర‌మ్‌. బుధ‌వారం ఆయ‌న పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా మేక‌ర్స్ ఆయ‌న క‌థానాయ‌కుడిగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్