జగన్‌కి ఉగ్రవాదుల ముప్పు.. జెడ్ ప్లస్ స్కేల్ భద్రత కల్పించాలి

స్వతంత్ర వెబ్ డెస్క్: ఏపీ ముఖ్యమంత్రి జగన్​కు ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాదులతో ముప్పు ఉన్నట్టు ఇంటెలిజెన్స్ విభాగం పేర్కొంది. ఇటీవల సీఎం జగన్ ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్రానికి పంపిన నోట్​లో ఈ అంశాలను పేర్కొన్నారు. ఆయనకు వామపక్ష తీవ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులు, వ్యవస్థీకృత నేరముఠాల నుంచి ముప్పు ఉందని.. జెడ్ ప్లస్ స్థాయి భద్రత కల్పించాల్సిందిగా రాష్ట్రప్రభుత్వం ఈ నోట్​లో స్పష్టం చేసింది. ఇప్పటి వరకూ దేశంలోని ముఖ్యమంత్రుల్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​కు మాత్రమే ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాదులతో ముప్పు ఉన్నట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రికి జెడ్ ప్లస్ స్థాయి భద్రత కల్పించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

ముకేశ్​ అంబానీకి ‘జెడ్ ప్లస్’​ సెక్యూరిటీ.. రక్షణగా 55 మంది..జెడ్ ప్లస్ స్కేల్ భద్రత కల్పించే వ్యక్తిగా జామర్, బులెట్ ప్రూఫ్ కార్ ఇతర సెక్యూరిటీ బందోబస్తు కల్పించాలని ఏపీ ప్రభుత్వం కోరింది. అలాగే ఆయన ప్రయాణించే విమానానికి కూడా విమానాశ్రయంలో సాయుధులైన భద్రతా సిబ్బందితో కాపలా కావాలని కోరింది. వాస్తవానికి ముఖ్యమంత్రి జగన్ కు ఇప్పటికే సీఎం సెక్యూరిటీ వింగ్​కు చెందిన భధ్రతను రాష్ట్రప్రభుత్వం కల్పిస్తోంది. దీనికి బాహ్యవలయంగా ఆక్టోపస్ దళానికి చెందిన 32 మంది గార్డులు ఆయనకు భద్రత కల్పిస్తున్నారు.

ఆ కమాండోలకు బ్యాండ్​ బాజాతో స్వాగతం ఉగ్రవాద వ్యతిరేక పోరాటానికి గానూ ఏపీలో ఆక్టోపస్ కమాండో గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. అయితే 2019 డిసెంబర్ 18వ తేదీన ముఖ్యమంత్రి జగన్‌కు వ్యక్తిగత భద్రత కల్పించేలా అక్టోపస్ కమాండోలను నియమించింది. సీఎం భద్రతకు సంబందించి ఎప్పటికప్పుడు డీజీపీ అధ్యక్షతన ఉన్నతాధికారుల బృందం సమీక్షిస్తుంది. రక్షణ కల్పించాల్సిన ఆవశ్యకతను ఆధారం చేసుకుని సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యమైన వ్యక్తులకు భద్రత కల్పిస్తారు. దీనికోసం ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్‌కు చెందిన సిబ్బందిని ప్రభుత్వం నియమిస్తుంది. ముఖ్యమంత్రి భద్రత కోసం ప్రత్యేకంగా సీఎం సెక్యురిటీ వింగ్​ను ఏర్పాటు చేశారు. సీఎం సెక్యురిటీ వింగ్ అంతర్గత వలయంలోనూ, అక్టోపస్ బాహ్య వలయంలోనూ ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్‌కు భద్రత కల్పిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల లేఖకు కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో వేచిచూడాల్సి ఉంది.

Latest Articles

కళ్యాణ్ రామ్.. ప్లాప్ డైరెక్టర్ కి ఓకే చెప్పాడా..?

నందమూరి కళ్యాణ్ రామ్.. బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత చేసిన సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇప్పుడు వెంకీతో కలిసి హిట్ మిషన్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్