ఓఖా రేవునుంచి బేట్ ద్వారక ద్వీపం కలిపే అతిపెద్ద కేబుల్ బ్రిడ్జి

    గుజరాత్‌లోని ద్వారకలో దేశంలోనే అతిపెద్ద కేబుల్ బ్రిడ్జి ని ప్రధాని మోదీ ప్రారంభించారు. 2.3 కిలోమీటర్ల పొడవున్న బ్రిడ్జికి సుదర్శన్ సేతు అని పేరు పెట్టారు. గుజరాత్ లోని ప్రధాన భూభాగం ఓఖా రేవు నుంచి బేట్ ద్వారక ద్వీపాన్ని కలుపుతూ రెండున్నర కిలోమీటర్ల మేరకు కేబుల్ స్టేట్ బ్రిడ్జి నిర్మించారు. 980 కోట్ల ఖర్చుతో నిర్మించిన ఈ కేబుల్ బ్రిడ్జి దేశంలోనే అత్యంత పొడవైనది. ద్వారకా పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో బేట్ ద్వారక అనేది ద్వీపం ఉంది. ఓఖా రేవు కు కేవలం రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉంది. బేట్ ద్వారకలో శ్రీకృష్ణుని ప్రసిద్ధ ద్వారకాధీశ్ ఆలయం ఉంది. బేట్ ద్వారక లోని ఆలయాన్ని సందర్శించే భక్తులు పగటిపూట మాత్రమే పడవలో ప్రయాణించగలరు. కొత్త వంతెన ద్వారా వారు ఎల్లవేళలా ప్రయాణించవచ్చని అధికారులు తెలిపారు. కేబుల్ బ్రిడ్జి ప్రారంభించిన అనంతరం మోదీ ఆలయాన్ని సందర్శించారు. 27. 20 మీటర్ల వెడల్పుతో నాలుగు లైన్లతో నిర్మించిన బ్రిడ్జిపై జనం నడిచేందుకు వీలుగా ఫుట్ పాత్ కూడా నిర్మించారు. సోలార్ ప్యానెల్ నిర్మించడంతో ఫుట్ పాట్ పై వెలుగులు కురిపిస్తుంది. ద్వారకాదీశ్‌ ఆలయ సందర్శనకు వచ్చే యాత్రికులకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

Latest Articles

మరో కార్మికుడి కన్నుమూత.. అమ్మని బాగా చూసుకో… వీడియో వైరల్‌

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మరొకరు మరణించడంతో.. మృతుల సంఖ్య 9కి చేరుకుంది. ప్రమాదంలో గాయ‌ప‌డిన పైడి రాజు అనే కార్మికుడు సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ క‌న్నుమూశాడు. ప్రమాదం జ‌రిగిన...
- Advertisement -

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్