33.2 C
Hyderabad
Friday, May 8, 2026
spot_img

పవన్‌ కల్యాణ్‌ పై నమోదైన క్రిమినల్‌ కేసు ఎత్తివేత

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌పై నమోదైన క్రిమినల్‌ కేసును ఎత్తివేశారు. పవన్‌పై నమోదైన అభియోగాలను తొలగిస్తూ గుంటూరు ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. కేసు ఎత్తి వేసేందుకు గల కారణాలను న్యాయమూర్తి ఆర్‌. శరత్‌బాబు వెల్లడించారు.

వాలంటీర్లు అసాంఘీక శక్తులుగా మారారని పవన్ కల్యాణ్ ఆరోపించారంటూ… గుంటూరు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ నేరుగా కోర్టుకు ఫిర్యాదు చేశారు. గతేడాది జులై 29న ఫిర్యాదు చేయగా కోర్టు ఆదేశాల మేరకు పవన్‌పై ఐపీసీ 499, 500 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించారు పవన్ కల్యాణ్‌. విచారణ చేపట్టిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం.. వాలంటీర్లను మరోసారి విచారించింది. అయితే.. తాము ఎలాంటి ఫిర్యాదులు చేయలేదని వాలంటీర్లు తెలపడంతో కేసును ఎత్తివేస్తున్నట్లు న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.

Latest Articles

కేటీఆర్‌లో పెరుగుతున్న ఫ్రస్ట్రేషన్‌తో బీఆర్ఎస్‌కు ఇబ్బందులు తప్పవా?

తెలంగాణ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం హద్దులు దాటుతోంది. పదేళ్ల పాటు అధికారంలో ఉండి, ఇప్పుడు ప్రతిపక్షానికే పరిమితమైన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్