ఏపీ అసెంబ్లీలో తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల బదిలీలపై చర్చ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక ప్రకటన చేశారు. ఉద్యోగుల బదీలీలపై తమ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని అన్నారు. అధికారుల తాజా నివేదిక ప్రకారం.. మొత్తం 1,942 మంది ఏపీ ఉద్యోగులు తెలంగాణకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. 1,447 మంది తెలంగాణకు చెందిన ఉద్యోగులు ఏపీకి రావాలనుకుంటున్నారని చెప్పారు. ఉద్యోగుల వన్‌టైమ్ రిలీవ్ కోసం తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని వివరించారు. అందుకు అక్కడి ప్రభుత్వం నుంచి సమాధానం రావాల్సి ఉందని మంత్రి పయ్యావుల స్పష్టం చేశారు.