స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గద్వాల-రాయచూర్ రహదారిపై శనివారం జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. గద్వాల పురపాలిక పరిధిలోని దౌధర్‌పల్లికి చెందిన జములమ్మ(45), అర్జున్(22), వైశాలి(18) కలిసి వ్యాపారం నిమిత్తం ఆటోలో రాయచూర్‌కు వెళ్తున్నారు. ఈ క్రమంలో వీరు ప్రయాణిస్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న బొలెరో గూడ్స్ అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న గద్వాల డీఎస్పీ రంగస్వామి, సీఐ చంద్రశేఖర్, ధరూర్ ఎస్సై శేఖర్‌రెడ్డి ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
0
343
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


