నిన్న రాత్రి గాలి వాన భీభత్సానికి కరీంనగర్ లో పలు చెట్లు కూలిపోయాయి. బొమ్మకల్ 5వ వార్డులోని వడ్డెర కాలనీలో గాలివాన భీభత్సానికి ఇళ్లు ధ్వంసమయ్యాయి. వడ్డెర కాలనీలో గండికోట రాజేశ్ ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. కరీంనగర్ మేయర్, డిప్యూటీ మేయర్ లతో కలిసి వడ్డెర కాలనీని కేంద్ర మంత్రి బండి సంజయ్ సందర్శించారు. కూలిన ఇల్లు నిర్మాణానికి తక్షణ ఆర్ధిక సాయం అందిస్తానని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. గండికోట రాజేశ్ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పారు. నగరంలో హోర్డింగ్‌ల పటిష్టతపై కమిటీ వేయనున్నట్లు బండి సంజయ్ తెలిపారు. గాలి వాన భీభత్సానికి వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులు అరిగోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరస్పర విమర్శలకే పరిమితమవుతున్నారే తప్ప రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ఇకనైనా యుద్ద ప్రాతిపదికన వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కొనుగోలు చేసిన వడ్లకు కేంద్రం పైసలిస్తున్నా ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నించారు. కేంద్రం వడ్లకు పైసలివ్వడం లేదని లేఖ రాసే దమ్ముందా? అని నిలదీశారు. కేవలం బీజేపీ ఆందోళనలతోనే అంతో ఇంతో వడ్ల కొనుగోలు జరుగుతోందని బండి సంజయ్ అన్నారు.
కరీంనగర్‌లో గాలివాన బీభత్సం.. కూలిన ఇళ్లు.. సాయం చేస్తామన్న బండి సంజయ్
0
22
Latest Articles
కొరియన్ కనకరాజు వచ్చేస్తున్నాడు..
మెగా హీరో వరుణ్ తేజ్ ఈమధ్య కాలంలో నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. సరైన బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్న వరుణ్ ఈసారి రూటు మార్చి డిఫరెంట్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు....
- Advertisement -
- Advertisement -


