అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదుడుకుల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 18 పాయింట్ల నష్టంతో 60,672 వద్ద క్లోజ్ అవ్వగా.. నిఫ్టీ 17 పాయింట్ల నష్టంతో 17,826 వద్ద స్థిరపడింది. ఉదయం సెన్సెక్స్ లాభాలతోనే ప్రారంభమైనా… ట్రేడింగ్ కొనసాగే కొద్ది మార్కెట్ ప్రతికూలతలు నష్టాల్లోకి తీసుకువెళ్లాయి. రిలయన్స్, NTPC,ICICI,HDFC బ్యాంకుల షేర్లు లాభాల్లో కొనసాగగా.. బజాజ్ ఫిన్ సర్వ్, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, విప్రో, టెక్ మహీంద్రా కంపెనీల షేర్లు నష్టాలు చవిచూశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.77 వద్ద ఆగిపోయింది.