UPI PayNow: భారత్-సింగపూర్ మధ్య డిజిటల్ లావాదేవీలు ఇకపై సులభతరం కానున్నాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా UPI PayNow ప్రక్రియను భారత ప్రధాని నరేంద్ర మోదీ, సింగపూర్ ప్రధాని లీ సూన్ లూంగ్ లు ప్రారంభించారు. భవిష్యత్ లో డిజిటల్ లావాదేవీలు నగదు లావాదేవీలను మించిపోనున్నాయని మోదీ ఆశాభావం వ్యక్తంచేశారు. గతేడాదిలోనే రూ.126లక్షల కోట్లకు పైగా 7400కోట్ల డిజిటల్ లావాదేవీలు జరిగాయని.. ఇవి సింగపూర్ కరెన్సీలో సుమారు రూ.2లక్షల కోట్లతో సమానమని వెల్లడించారు. UPI,PayNowల మధ్య తొలి లావాదేవీని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్, సింగపూర్ మానిటరీ అథారిటీ ఎండీ రవి మేనన్ లు చేశారు. దీంతో ఇరు దేశాల యూజర్లు ఇక సులభంగా డిజిటల్ చెల్లింపులు చేసుకోవచ్చు.
Read Also: