నేటి నుంచే ‘చిన్ని’ ప్రారంభం

చిన్ని.. ఈ పేరులోనే గుండె తలుపు తట్టే ఆప్యాయత, మనసుకి బాగా దగ్గరైన మమకారం వినిపిస్తాయి. ఈసారి స్టార్ మా ప్రారంభించబోతున్న సరికొత్త సీరియల్ పేరు “చిన్ని”. తల్లి సెంటిమెంట్‌తో నడిపించే ఒక కొత్త తరహా కథతో సిద్ధమైన ఓ అమ్మాయి కథ ఇది. జైలులో పుట్టి, జైలులోనే తల్లితోపాటు వుండి, అదే ప్రపంచం అనుకుని, అక్కడున్నవాళ్ళే తన బంధువులు అనుకుని పదేళ్లవరకు పెరిగిన చిన్ని తల్లిని వదిలి బయటి ప్రపంచానికి వస్తుంది. అమ్మని వదిలి.. అమ్మ ఇచ్చిన నమ్మకంతో బయటకి కదిలిన చిన్ని తరవాతి జీవితం ఎలా వుండబోతోంది? అసలు తల్లి జైలులో ఎందుకు ఉండాల్సివచ్చింది? చిన్నికి నీడనిచ్చేది ఎవరు? అసలు పరిచయం లేని ప్రపంచంలో చిన్ని ఎలా వుండబోతోంది? అమ్మ లేని చోట తనకి అంత ప్రేమ దక్కుతుందా? లాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానమే ఈ “చిన్ని” సీరియల్. తల్లీకూతుళ్ళ మధ్య ప్రేమానుబంధాలు, భావోద్వేగాలకు “చిన్ని” సీరియల్ వేదిక కాబోతోంది. చిన్ని చూడని ఓ కొత్త ప్రపంచం ఆమెని ఎలా అక్కున చేర్చుకోబోతోందో, చిన్ని అక్కడ ఎన్ని సమస్యలు ఎదుర్కోబోతోందో.. తల్లి ఇచ్చిన ధైర్యంతో ఎవరికి ఎలా సమాధానం చెప్పి నెగ్గుకొస్తుందో.. మనకి చెబుతుంది “చిన్ని” కథ. స్టార్ మా లో “చిన్ని” సీరియల్ జులై 1 న ప్రారంభం కానుంది. సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 7 గంటలకు ప్రసారం అవుతుంది.

Latest Articles

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్‌లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్