20.7 C
Hyderabad
Tuesday, March 18, 2025
spot_img

కేంద్రంపై రెండు అంశాలపై స్టాలిన్ యుద్ధం

కేంద్ర ప్రభుత్వంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ యుద్ధం ప్రకటించారు. ఈసారి ఒకటి కాదు, మొత్తం రెండు వివాదాస్పద అంశాలపై కేంద్రంతో సమరానికి సై అన్నారు స్టాలిన్. ఇందులో ఒకటి భాషా వివాదం. ఒక్కమాటలో చెప్పాలంటే, త్రిభాషా సూత్రం కింద హిందీని తమపై బలవంతంగా రుద్దితే, సహించేది లేదని తెగేసి చెప్పడం. ఇక రెండోది డీ లిమిటేషన్ ప్రక్రియ.

త్రిభాషా విధానాన్ని తమ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించడానికి గల కారణాలను వివరిస్తూ డీఎంకే కార్యకర్తలకు ముఖ్యమంత్రి స్టాలిన్ బహిరంగ లేఖ రాశారు. తమిళ సంస్కృతిని దెబ్బతీయడానికి తమపై బలవంతంగా హిందీని రుద్దడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. హిందీ భాష ముసుగులో తమిళనాడులో ఆర్య సంస్కృతిని రుద్దడానికి ఎవరు ప్రయత్నించినా, డీఎంకే ప్రతిఘటిస్తుందన్నారు. ఈ సందర్బంగా హిందీ కారణంగా ఉత్తరాన దాదాపు పాతిక భాషలు ఎలా కనుమరుగు అయ్యాయో స్టాలిన్ వివరించారు. హిందీని స్వీకరించిన తరువాత బీహారీలు తమ మాతృభాష మైథిలిని మరచిపోయారన్నారు. అలాగే ఉత్తర ప్రదేశ్ ప్రజల మాతృభాష అయిన బ్రజ్ భాష కూడా మనుగడ కోల్పోయిందన్నారు.

అలాగే కేవలం హిందీ ఆధిపత్యం కారణంగా భోజ్‌పురి, బుందేలీ, గర్వాలీ, సంథాలీ, మార్వారీ భాషలు కూడా అంతర్థానం అయ్యాయన్నారు. అటువంటి పరిస్థితి తమిళ భాషకు రాకూడదని తాము కోరుకుంటున్నట్లు ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. ద్రవిడ ఉద్యమం కలిగించిన చైతన్యం, ద్రవిడ పార్టీల పోరాటాల కారణంగానే తమిళభాష ఇప్పటికీ సురక్షితంగా ఉందన్నారు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. అయితే తమిళ భాషను దెబ్బతీయడానికే జాతీయ విద్యా విధానం ముసుగులో హిందీ భాషను తమిళనాడు ప్రజలపై బలవంతంగా రుద్దడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని డీఎంకే కార్యకర్తలకు రాసిన లేఖలో ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే, కేంద్రం ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తున్న త్రిభాషా విధానానికి వ్యతిరేకంగా తమిళనాట అనేక ప్రాంతాల్లో ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. హిందీ ని బలవంతంగా రుద్దే ప్రయత్నాలను అడ్డుకుంటామంటూ ఆందోళనకారులు నినాదాలు చేస్తున్నారు. కాగా త్రిభాషా సూత్రానికి వ్యతిరేకంగా శివ అనే పేరున్న ప్రభుత్వ ఉద్యోగి ఒకరు రాజీనామా చేశారు. రాజీనామా లేఖలో …గో బ్యాక్ మోడీ అని సదరు ఉద్యోగి రాశారు.

కాగా తమిళనాడులో ట్విట్టర్ వేదికగా ఇటీవల హ్యాష్ ట్యాగ్ వార్ ప్రారంభమైంది. డీఎంకే వారు….గెట్ అవుట్ మోడీ …అంటే దానికి కౌంటర్ గా …గెట్ అవుట్ స్టాలిన్ అన్నారు బీజేపీ నాయకులు. కొన్ని రోజులుగా తమిళనాడులో భాషా వివాదం నెలకొంది. జాతీయ విద్యా విధానం కింద త్రిభాషా సూత్రాన్ని తమిళనాడులో కూడా కచ్చితంగా పాటించాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఇటీవల స్పష్టం చేశారు. త్రిభాషా సూత్రాన్ని పాటించపోతే, సమగ్ర శిక్ష అభియాన్ కింద ఇచ్చే 2,400 కోట్ల రూపాయల నిధులను నిలుపుదల చేస్తామని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తమిళనాడు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ హెచ్చరికలను డీఎంకే సీరియస్ గా తీసుకుంది. దీంతో …గెట్ అవుట్ స్టాలిన్ …అంటూ తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ట్వీట్ చేశారు. దీనికి భారతీయ జనతా పార్టీ కౌంటర్ ఇచ్చింది. గెట్ అవుట్ స్టాలిన్ …అంటూ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అన్నామలై హ్యాష్ ట్యాగ్ తో డీఎంకే పై విమర్శలు గుప్పించారు.

ఇక కేంద్రంపై పోరాటానికి ఎంకే స్టాలిన్ ఎంచుకున్న రెండో అంశం…డీ లిమిటేషన్ ప్రక్రియ. అంటే జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన.2026లో జరిగే జనగణన ఆధారంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశాలున్నాయి. దీంతో అధిక జనాభా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలకు లోక్‌సభలో ఎక్కువ సీట్లు దక్కబోతున్నాయి. అంతిమంగా కుటుంబ నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు ప్రధానంగా తమిళనాడుకు తీరని నష్టం జరగబోతోంది. ఇదే జరిగితే జాతీయ రాజకీయాల్లో తమిళనాడు పాత్ర తగ్గిపోవడం ఖాయం అంటున్నారు ఎంకే స్టాలిన్.

తమిళనాడులో ప్రస్తుతం మొత్తం 39 లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి.డీ లిమిటేషన్ జరిగితే, మరో రెండు నియోజకవర్గాలు పెరిగే అవకాశాలున్నాయి. అంటే మొత్తం లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్య 41 కు చేరుతుంది. ఇదిలా ఉంటే 70వ దశకంలో ఇందిరా గాంధీ సర్కార్ ఇచ్చిన కుటుంబ నియంత్రణ పిలుపునకు తమిళనాడు సహా అన్ని దక్షిణాది రాష్ట్రాలు స్పందించాయి. దీంతో దక్షిణాది ప్రభుత్వాలు కుటుంబ నియంత్రణను బాగా ప్రోత్సహించాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులు అంటూ నిబంధనలు కూడా పెట్టాయి. అయితే ఉత్తరప్రదేశ్‌, బీహార్, రాజస్థాన్ లాంటి ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం కుటుంబ నియంత్రణను ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో ఉత్తరాది రాష్ట్రాల్లో ఎప్పటిలా జనాభా విపరీతంగా పెరుగుతూ పోయింది. అదే సమయాన దక్షిణాది రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ ఫలితంగా జనాభా తగ్గడం మొదలైంది.

జనాభా లెక్కల ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఉత్తరప్రదేశ్‌, బీహార్, రాజస్థాన్ లాంటి ఉత్తరాది రాష్ట్రాలకు ఎంతో మేలు జరుగుతుంది. జనాభా లెక్కల ప్రాతిపదికన మొత్తంగా లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను 543 నుంచి పెంచాలని నిర్ణయించుకుంటే మొత్తం సీట్లు 848 అయ్యే అవకాశాలున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుతమున్న 80 నియోజకవర్గాలు 143కు పెరిగే అవకాశాలున్నాయి. అంటే ఉత్తర ప్రదేశ్‌లో కొత్తగా 63 సీట్లు పెరుగుతాయి. అలాగే ఎక్కువ జనాభా ఉన్న బీహార్, రాజస్థాన్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లోనూ లోక్‌సభ నియోజకవర్గాలు పెరిగే అవకాశాలున్నాయి. కాగా దక్షిణాది రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్య దాదాపు 28 శాతం సీట్లు పెరిగే అవకాశాలున్నాయి. అయితే ఉత్తరాదితో పోలిస్తే, దక్షిణాదికి అన్యాయమే జరుగుతుంది. ఈ అంశంపైనే కేంద్రంతో పోరాటానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సన్నద్ధమయ్యారు.

Latest Articles

‘కాలమేగా కరిగింది’ ట్రైలర్ చూశారా?

వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "కాలమేగా కరిగింది". ఈ సినిమాను శింగర క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై మరే శివశంకర్ నిర్మిస్తున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్