కారణాలు ఏవైనా ఏపీ టూరిజం బస్ ప్యాకేజీ, తిరుమల శ్రీవారి టికెట్ల కేటాయింపు అభ్యంతరాల విషయంలో టీటీడీ పాలకమండలి నిర్ణయానికి చుక్కెదురైంది. టీటీడీ పాలక మండలి సదుద్దేశంతోనే ఈ చర్య తీసుకున్నా…అది దుందుడుకు చర్యగా మారింది. టూరిజం బస్ ప్యాకేజీల వల్ల శ్రీవారి దర్శన టికెట్ల విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణలు వచ్చాయి. దీంతో, టీటీడీ పాలకమండలి ఈ దర్శన టికెట్ల రద్దు నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ నిర్ణయంతో టూరిజానికి గట్టి దెబ్బ తగిలింది. ఈ చర్య వల్ల తమ శాఖ నెలకు కోటి రూపాయల ఆదాయాన్ని కొల్పోతోందని పర్యాటక సంస్థ తల్లడిల్లింది. ఈ సంస్థ చైర్మన్, ఉద్యోగులు సీఎం చంద్రబాబు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. దీంతో, పాలక మండలికి తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆలస్యం అమృతం విషం.. ఈ అమృత వాక్కును చెప్పిన పెద్దలే ముందు వెనుకలు ఆలోచించకుండా ఏ పని చేయరాదని చెప్పారు. ఇదేం..తిరకాసు అని పెద్దలపై అసహనం రావడం సహజమే. అయితే, సమయానుసారం, సందర్భానుసారం సామెతలు పాటించాలితప్ప.. బ్లైండ్ గా ఏ పనిలో ముందుకు వెళ్లకూడదు. ఈ విషయాన్ని సైతం పెద్దలే చెప్పారు. ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ బస్ ప్యాకేజి ద్వారా తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణలు వచ్చాయి. దీంతో, టీటీడీ పాలకమండలి టికెట్ల కేటాయింపు నిలుపుదలకు సిఫారసు చేసింది. పాలక మండలి నిర్ణయంతో పర్యాటకరంగం నెలకు దాదాపు కోటి రూపాయల ఆదాయాన్ని కోల్పోతోంది. ఈ విషయాన్ని సంస్థ చైర్మన్ తో పాటు ఉద్యోగులు సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై టికెట్ల రద్దుకు చెక్ పెట్టి పునరుద్ధరణకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ తెలిపారు. దీంతో, పాలకమండలికి తన పట్టు సడలించుకోవాల్సిన పరిస్థితి, మెట్టు దిగాల్సిన స్థితి వచ్చింది.
ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ బస్ ప్యాకేజీల ద్వారా భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకునేవారు. వైసీపీ సర్కారు హయాంలో దేవస్థానం తరఫున రోజుకు 2,500 మందికి 300 రూపాయల దర్శనం టికెట్లను కేటాయించేది. కర్నాటక, తమిళనాడు, తెలంగాణ తదితర రాష్ట్రాలకు చెందిన పలువురు భక్తులు బస్ ప్యాకేజీ ద్వారా స్వామివారిని దర్శించుకునే వారు. కరోనా అనంతరం టీటీడీ ఈ కేటాయింపును వెయ్యికి కుదించింది.
కూటమి సర్కారు వచ్చాక.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలు, లోపాలు, దోషాలకు చెక్ పెట్టేందుకు పలు చర్యలు తీసుకుంటోంది. పర్యాటకాభివద్ది సంస్ట అధ్వర్యంలో కొనసాగుతున్న బస్ ప్యాకేజిల ద్వారా ఇచ్చే శ్రీవారి దర్శనం టికెట్ల విషయంలో అవకతవకలు చొటుచేసుకొంటున్నాయని ఆరోపణలు వచ్చాయి. దీంతో, ఈ టికెట్ల కేటాయింపును నిలిపివేయాలని టీటీడీ పాలక మండలి తొలుత నిర్ణయం తీసుకుంది. అనంతరం అమలు పర్చింది.
ఈ నేపథ్యంలో పర్యాటక అభివృద్ధి సంస్థ బస్సు ప్యాకేజీల ద్వారా భక్తులు చేసుకునే దర్శనాలు నిలిచిపోయాయి. వ్యవస్థలోని లోపాలను సరిదిద్దాల్సిన బాధ్యత పాలకమండలి మీద ఉందనే విషయం కాదనలేని సత్యం. అయితే, కొండ నాలుక మందు ఉన్న నాలుకకో, మరో నాలుకకో దెబ్బతగిలితే..బాధ ఎవరికైనా బాధే కదా..! బస్ ప్యాకేజీ ద్వారా శ్రీవారి దర్శనం టికెట్ల నిలిపి వేతతో, పర్యాటక అభివృద్ధి సంస్థ పలు విధాల నష్టపోయింది. పర్యాటకం ప్రతి నెలా కోటి రూపాయలు కోల్పోవడమే కాకుండా, ఇందులో జీవనోపాధి పొందుతున్న 170 మంది ఉద్యోగులు కొలువులు కోల్పోయారు.
తిరుమల తిరుపతి దేవస్టానం పాలకమండలి తీసుకొన్న నిర్ణయం వల్ల ఎపీ పర్యాటక అభివద్ది సంస్ధ దెబ్బతినటాన్ని టూరిజం సంస్ద చైర్మన్ నూకసాని బాలాజీ, సంస్థ ఉద్యోగులు..సీఎం నారా చంద్రబాబు నాయుడుకు వివరించారు. పాలకమండలి చర్యవల్ల పర్యాటక సంస్ధ కు ఏర్పడిన దుస్థితిని సీఎంకు టూరిజం చైర్మన్ బాలాజీ వివరించారు. ఇతర రాష్ట్రాల భక్తులతోపాటు, సంస్ధ మనుగడను పరిగణనలోకి తీసుకొని పాలకమండలి నిర్ణయంపై పున: సమీక్షించాలని కొరారు.
సీఎం చంద్రబాబు దీనిపై సానుకూలంగా స్పందించారని పర్యాటక సంస్ధ చైర్మన్ నూకసాని బాలాజీ తెలిపారు. పర్యాటకం అధ్వర్యంలో తిరుమల ప్యాకేజీ టూర్ పునరుద్ధరణ ప్రకటన త్వరలో వస్తోందని తెలియడంతో స్వామివారి భక్తులు హర్షం వ్యక్తం చేశారు.