25.2 C
Hyderabad
Tuesday, October 3, 2023
spot_img

శ్రీ సరస్వతీ విద్యాపీఠంలో ఘనంగా స్వర్ణజయంతి వేడుకలు

Sri saraswathi vidya peetham sisu mandir schools: శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఆవిర్భవించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వర్ణజయంతి వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో సేవలందిస్తున్న ప్రధాన అధ్యాపకులు, ఉప ప్రధాన అధ్యాపకులకు హైదరాబాద్ శారదాధామంలో ఆవరణలో మూడు రోజులు ప్రత్యేక శిబిరం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్యా భారతి అఖిల భారత అధ్యక్షులు దూసి రామకృష్ణారావు, సంఘటన కార్యదర్శి గోవింద్ మొహంతో, దక్షిణ మధ్య క్షేత్ర అధ్యక్షులు డాక్టర్ చామర్తి ఉమామహేశ్వరరావు, కార్యదర్శి అయాచితుల లక్ష్మణరావు, సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డిలు పాల్గొని మార్గదర్శనం చేశారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో 400 పైగా పాఠశాలలను శ్రీ సరస్వతి విద్యాపీఠం నిర్వహిస్తోంది. విలువలతో కూడిన విద్యను అందించేందుకు 50ఏళ్లుగా అలుపెరగని కృషి చేస్తోంది.

ప్రధాన అధ్యాపకుల శిబిరంలో శ్రీ సరస్వతీ విద్యాపీఠం ప్రగతిని చర్చించారు. శిశు మందిర్ పాఠశాలల నిర్వహణలో కీలక పాత్ర వహిస్తున్న ఆచార్యులతో భవిష్యత్తు ప్రణాళికల మీద చర్చించారు. ఈ సందర్భంగా ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర  అధ్యక్షులు ప్రొఫెసర్ తిరుపతి రావు, కార్యదర్శి ముక్కాల సీతారాములు, క్షేత్ర శైక్షణిక్ ప్రముఖ్ రావుల సూర్యనారాయణ ఆధ్వర్యంలో జరిగాయి.

ఈ సందర్భంగా శ్రీ సరస్వతీ విద్యాపీఠం అభ్యున్నతికి కృషిచేసిన సంఘటన కార్యదర్శులు జేఎమ్ కాశీపతి,  లింగం సుధాకర్ రెడ్డి, వీఆర్ జగదీష్, పతకమూరి శ్రీనివాస్, కన్నా భాస్కర్, పసర్తి మల్లయ్య తదితరులను సత్కరించారు.

తెలుగు నాట విలువలతో కూడిన విద్యను, సామాజిక నైపుణ్యాలను  అన్ని వర్గాల విద్యార్థులకు సేవాభావంతో శ్రీ సరస్వతీ విద్యాపీఠం అందిస్తోంది. ఈ నిరంతర కృషి లో జీవిత పర్యంతం సేవలు అందిస్తున్న  ప్రచారక్ లను సత్కరించారు.

ఈ ప్రస్థానం లో ముఖ్య పాత్ర పోషించిన నాయకత్వ శ్రేణులు,  టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ను అభినందించారు. మూడు రోజుల శిబిరం నిర్వహణ ద్వారా సిబ్బంది లో మరింత ఉత్తేజం కల్పించారు.

Latest Articles

అక్టోబర్ 13న ఆర్ నారాయణమూర్తి ‘యూనివర్సిటీ’

స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానర్‌లో ఆర్ నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘యూనివర్సిటీ’. ఈ చిత్రం అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా ప్రసాద్ ల్యాబ్‌లో మీడియా సమావేశం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
289FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్