She is looking miserable netizens trolls Mrunal thakur: తెలుగు సినిమా ‘సీతారామం’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాలో అందరికన్నా ఎక్కువ పేరొచ్చింది… అందరి మనసుల్లో నిలిచిపోయింది ఒక్కరే… ఆమె ఎవరో కాదు… హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ …


ఇప్పుడు టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది హీరోయిన్ ఎవరంటే మృణాళ్ కూడా ఒకరని అంటున్నారు. అందం ఒక్కటే కాదు…అభినయంతో కూడా మెప్పించింది. మనసులో భావాలను పలికించడంలో అద్వితీయమైన ప్రతిభను చూపించింది. ఇలా ఒక్కసారి ఒక్క సినిమాతో అందరి దృష్టిలో పడిపోయింది.
ఇంతకీ విషయం ఏమిటంటే…అభిమానులతో చిట్ చాట్ చేయడంలో ఇప్పుడున్న హీరోయిన్లందరూ బిజీగా ఉన్నారు. ఎందుకంటే అదొక మార్కెట్ స్ట్రాటజీగా మారిపోయింది. సోషల్ మీడియాలో నిత్యం టచ్ లో ఉండాలి. తన సినిమాలు నలుగురు చూడాలి. తన గురించి నలుగురు మాట్లాడుకోవాలి. తన మనసులో మాట పదిమందికి తెలియాలి. అంతకుమించి అభిమానులతో చిట్ చాట్ చేయాలి.. ఇలా ఎన్నోకారణాలన్నమాట.
ఈ క్రమంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు…

‘మీకు కాబోయే భర్త అందగాడై ఉండాలని అనుకుంటున్నారా?’ అన్న ప్రశ్నకు ‘‘అందంతో పని లేదు. మంచివాడై ఉంటే చాలు’’ అని మృణాళ్ సమాధానం ఇచ్చింది. నెటిజన్లు అంతా శభాష్ అంటూ కామెంట్లు పెట్టారు. చాలా గొప్ప నిర్ణయం అంటూ చాలామంది మెచ్చుకున్నారు.
ఇది జరిగిన కొన్నిరోజుల తర్వాత ‘కపిల్ శర్మ షో’ లో మృణాళ్ పాల్గొంది. ఆ సమయంలో మళ్లీ ఇదే ప్రశ్న ఎదురైంది. మీకు కాబోయే భర్త ఎలా ఉండాలి అని అంటే…‘మంచి అందగాడై ఉండాలి’ అని బదులిచ్చింది.
దాంతో అభిమానులు చాలా హర్ట్ అయ్యారు.
అందం అవసరం లేదని మొన్న అన్నావు… మాకెంతో సంతోషం వేసింది. మేమెంతో ఆరాధించాం. ఇప్పుడు అందగాడే కావాలంటున్నావ్, అలాంటప్పడు మిగిలిన మాలాంటి వాళ్ల సంగేతేంటి? అన్నంత రీతిలో తెగ బాధపడిపోతూ… ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
‘‘నీది రెండు నాల్కల ధోరణి అని ఒకరంటే, మాట మీద నిలబడే మనిషివి కాదు’’ అని మరికొందరు ఇలా ఆమెను విమర్శించడం మొదలుపెట్టారు.


అయితే చాలావాటికి ఎంతో ఓపికగా బదులిచ్చింది. తను ఎందుకలా అన్నాదో వివరించింది. కాబోయే భర్త విషయంలో అప్పుడు ఒక మాట చెప్పాను. ఇప్పుడొక మాట చెప్పాను. కాలంతోపాటు మనుషుల అభిప్రాయాలు మారుతుంటాయి. అయితే ఆ విషయాన్ని ధైర్యంగా చెప్పాను. దాగుడుమూతలు ఆడలేదని వివరించింది. కానీ ఎవరూ ఆమె మాట లేదు. తను వివరించే కొద్దీ వ్యంగ్యం ఎక్కువైపోయింది.
దీంతో మృణాళ్ కి వళ్లు మండిపోయింది. నటీనటులు కూడా మనుషులే అన్న విషయాన్ని కొంతమంది మరిచిపోతుంటారు అనుకుంటాను. వారికి మనసు ఉంటుంది. వారికి బాధ కలుగుతుంది. వారికి ఒక కుటుంబం ఉంటుంది…అన్న భావం వచ్చేలా చెప్పుకొచ్చింది. అప్పుడు కొంత ట్రోలింగ్ బాధ తగ్గింది. చాలామంది ఆమెవైపు మాట్లాడటం మొదలుపెట్టారు. దీంతో ఇష్యూ సద్దుమణిగింది.

ఈ విషయాన్ని పక్కన పెడితే నెటిజన్లతో తన అభిరుచులను ఆమె పంచుకున్నారు. వాటిలో ముఖ్యమైనవి తనకు మధురైలోని దేవాలయాలంటే చాలా ఇష్టమని తెలిపింది. తనకు చీరలు అంటే చాలా ఇష్టమని, అవి తనకు చాలా బాగా నప్పుతాయని వివరించింది. ఐరన్ మ్యాన్ అంటే ఇష్టమని, మార్వెల్ స్టూడియోస్ తెరకెక్కించే సూపర్ హీరో సినిమాలో నటించాలని ఉంది… అని చెప్పుకువచ్చింది. ఈ క్రమంలోనే కాబోయే భర్త విషయంలో నెటిజన్ల సుడిగుండంలో పడి చిక్కుకుని విలవిల్లాడింది.