మోడల్, నటి ట్విషా శర్మ కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. భోపాల్‌లోని ఘటన జరిగిన ఇంట్లో సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేయనున్నారు అధికారులు. ఇందులో భాగంగా ట్విషా శర్మ భర్త సమర్థ్ సింగ్, అత్త గిరిబాలా సింగ్‌ను భోపాల్‌లోని తమ ఇంటికి తీసుకెళ్లనున్నారు. అక్కడ ట్విషా శర్మను ఉరివేసుకున్న స్థితి నుంచి ఎలా కిందికి దించారు అనే విషయాన్ని ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. విచారణలో సమర్థ్ సింగ్ తానే ట్విషాను ఉరి నుంచి కిందికి దించానని, తన తల్లి గిరిబాలా సింగ్ ఆమె మెడకు ఉన్న ముడిని విప్పిందని సీబీఐ అధికారులకు తెలిపినట్లు సమాచారం. ట్విషా మృతదేహం వేలాడుతూ కనిపించిన ఇంటి ప్రదేశానికే సమర్థ్, గిరిబాలాలను తీసుకెళ్లి మొత్తం ఘటనను రీక్రియేట్ చేయనున్నారు. ఈ వాదనల నిజానిజాలను నిర్ధారించేందుకు సీబీఐ ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. దాదాపు 80 కిలోల బరువున్న డమ్మీని ఉపయోగించి సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేయనున్నారు. సమర్థ్ సింగ్‌ను ఆ డమ్మీని వేలాడుతున్న స్థితి నుంచి కిందికి దించేలా చేసి, ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్, వాస్తవ పరిస్థితులకు సరిపోతుందా లేదా అనేది పరిశీలించనున్నారు. అలాగే గిరిబాలా సింగ్‌ను కూడా డమ్మీ మెడకు కట్టిన ముడిని విప్పి చూపించాలని అధికారులు కోరనున్నారు. దీని ద్వారా ఇద్దరూ చెప్పిన కథనం, సంఘటనా స్థలంలో లభించిన ఆధారాలు, ఫోరెన్సిక్ నివేదికలతో సరిపోతాయా లేదా అనేది విశ్లేషించనున్నారు.
ట్విషా శర్మ కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం.. డమ్మీ బొమ్మతో ఇంట్లో సీన్ రీ కన్‌స్ట్రక్షన్
0
36
Previous article
Latest Articles
క్రిష్ ప్రయోగం ఫలించేనా..?
మంచి కథలు చెప్పాలని తపించే దర్శకుల్లో ఒకరు క్రిష్. ఈమధ్య వరుసగా ప్లాపులు రావడంతో కెరీర్లో బాగా వెనకబడ్డాడు. అనుష్కతో ఘాటీ సినిమా చేసిన తర్వాత ఇంత వరుకు క్రిష్ మూవీ ఎవరితో...
- Advertisement -
- Advertisement -


