హైదరాబాద్ నుంచి ఇండిగో విమానంలో బయలు దేరి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న టీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు విమానాశ్రయంలో స్వాగతం పలికారు కాంగ్రెస్ శ్రేణులు. స్టీల్ ప్లాంట్ కార్మికులకు సంఘీభావం తెలిపిన షర్మిల.. ఇవాళ సాయంత్రం ఉక్కు పరిరక్షణ కమిటీ యూనియన్ లీడర్‌లతో భేటీకానున్నారు. ఈ క్రమంలోనే విశాఖ చేరుకున్న ఆమె.. కాసేపట్లో గాంధీ జయంతి సందర్భంగా ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర వద్ద బాపూజీ విగ్రహానికి నివాళులర్పించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం సాయంత్రం విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉక్కు పరిరక్షణ కమిటీ యూనియన్ లీడర్ ధర్నాలో పాల్గొంటారు.