24.7 C
Hyderabad
Monday, March 24, 2025
spot_img

S-99 ‘టీజర్ ను లాంచ్ చేసిన దర్శకేంద్రుడు

స్వతంత్ర వెబ్ డెస్క్: టెంపుల్ మీడియా పతాకం పై దర్శకులు సి .జగన్మోహన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘S 99.’ యాక్షన్ అండ్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యతీష్ అండ్ నందిని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే ఫస్ట్ లుక్ ను ప్రసాద్ ల్యాబ్స్ అధినేత రమేష్ ప్రసాద్ రిలీజ్ చేసిన విషయం ప్రేక్షకులకు తెలిసిందే.. కాగా ఈ చిత్ర టీజర్ ను దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు నేడు విడుదల చేశారు. ఈ సందర్భంగా రాఘవేంద్రరావు మాట్లాడుతూ .. ‘ఈ టీజర్ ని చూశాను.. చాలా అద్భుతంగా అనిపిస్తుంది టెక్నికల్‌గా కావచ్చు. కెమెరా వర్క్ చాలా కొత్తగా అనిపిస్తుంది. తెలుగు హిందీ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. అని అన్నారు.

ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు చిత్ర టీజర్ ను విడుదల చేసిన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుకి ధన్యవాదాలు తెలిపారు. దర్శకేంద్రుడు ఈ సినిమాకి సంబంధించి టీజర్ ని విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందని జగన్మోహన్ తెలిపారు. ఈ S99 సినిమా యాక్షన్ థ్రిల్లర్‌గా మీ ముందుకు రాబోతుందని మీరందరూ కూడా ఈ సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నాను అంటూ దర్శకుడు జగన్మోహన్ తెలిపారు. ఇంకా ఈ సినిమాకు సంబంధించిన ఆరు టీజర్ లను వివిధ రకాలుగా రిలీజ్ చేస్తామని తెలిపారు. ‘S99’ చిత్రం వచ్చేనెల మొదటి వారంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేస్తామని ప్రకటించారు. ఇలాంటి మరిన్ని చిత్రాలని తీయడానికి సిద్ధంగా ఉన్నామని నిర్మాత యతీష్ అన్నారు.

Latest Articles

శిథిలాలయంగా బనగానపల్లె ఆయుర్వేద వైద్యాలయం-కిటికిటీలకు అద్దాలు అమరిస్తే కొత్త భవనం రెడీ-మీనమేషాల లెక్కింపుతో కాలహరణం

కొత్త వింత కావచ్చు, కాని పాతని రోతగా చూడ్డం ఏం సబబు.. ఏ కొత్తయినా పాతనుంచే పుడుతుంది. ఒకప్పుడు ఉమ్మడి జిల్లా ప్రజలపాలిట ఆరోగ్యప్రదాయినిలా ఉండే ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి శిథిల భవనంలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్